ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

క్రికెటర్ తో క్రేజీ బ్యూటీ ఎఫైర్...?

క్రికెటర్ తో క్రేజీ బ్యూటీ ఎఫైర్...?

యువ క్రికెటర్ రితురాజ్ గైక్వాడ్, ప్రముఖ మరాఠి నటి సయాలి సంజీవ్ కొన్నాళ్లుగా డేటింగ్ లో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. యంగ్ క్రికెటర్ ప్లేయింగ్ కి ఫిదా అయిన సయాలి అతగాడితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందని నెట్టింట వార్తలు హల్చల్ చేస్తున్నాయి. రితురాజ్ ఇంటర్నేషనల్ ప్లేయర్ కాకపోయినప్పటికీ , ఆ అవకాశం ఉన్న లిస్ట్ లో అతని పేరు ఉండడంతో ఈ టాపిక్ ఒక రేంజ్ లో వైరల్ అవుతుంది.

అయితే ఈ రూమర్స్ అన్నిటికి చెక్ పెడ్తూ రీసెంట్ గా సయాలి స్పందించింది. " ఈ తరహా కథనాలు నన్ను నా కుటుంబాన్ని ఎంతో ఆవేదనకు గురిచేస్తున్నాయి, ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఇప్పుడు ఇలాంటి వరుస కథనాల వల్ల ఇద్దరిమధ్య ఉన్న స్నేహం చెడిపోతుంది అని బాధపడ్డారు. ఫ్రెండ్ షిప్ కంటే ఎక్కువ ఎఫ్ఫైర్ ఉందని వస్తున్న వార్తలు నన్ను మానసికంగా  బలహీనపరుస్తున్నాయని " అన్నారు.

రితురాజ్ వరుసగా సెంచరీలు సాధిస్తున్నా, మహారాష్ట్ర టీం ని ఫైనల్స్ కి చేర్చినా.. అతనికి కనీసం నేను బెస్ట్ విషెస్ కూడా చెప్పలేదు. విష్ చేస్తే ఇంకెలాంటి కథనాలు ప్రచారం చేస్తారో అని భయంగా ఉందని వాపోయింది ఈ ముద్దుగుమ్మ.

క్రికెటర్స్, హీరోయిన్స్ మధ్య ఇలాంటి రూమర్స్ రావడం ఎంత సహజమో, కొన్నాళ్ళు రిలేషన్ లో ఉండి తర్వాత విడిపోవడం కూడా అంతే సహజం. ఈ రెండు రంగాల మధ్య అవినాభావ సంబంధం ఎప్పటినుండో కొనసాగుతుందన్న విషయం తెలిసిందే. గ్లామర్ ఫీల్డ్ కి క్రికెటర్స్ కి అలా సెట్ అయ్యిందంతే..

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :