ASBL NSL Infratech

అమేఠీ నుంచి రాబర్ట్ వాద్రా పోటీ?

అమేఠీ నుంచి రాబర్ట్ వాద్రా పోటీ?

కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ అల్లుడు, వ్యాపారవేత్త రాబర్ట్‌ వాద్రా రాజకీయాల్లోకి రానున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారా? ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలను గమనిస్తే అలాగే కనిపిస్తోంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌లోని అమేఠీ నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్లు సూచనప్రాయంగా వెల్లడించారు. రాజకీయాల్లోకి రమ్మని నన్ను చాలా మంది కోరుతున్నారు. గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తిని కాబట్టి నాపై అంచనాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఒకవేళ నేను పోటీలోకి అడుగుపెడితే అమేఠీని ఎంచుకుంటా. రాజకీయాల్లో నా మొదటి అడుగు అమేఠీతోనే ఉండాలని భావిస్తున్నా. ఆ నియోజకవర్గ ప్రజలు కూడా గాంధీ నెహ్రూ కుటుంబసభ్యులే కావాలని కోరుకుంటారు అని వాద్రా అన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :