నీతా అంబానీ భారీ సాయం
ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ దంపతులు ఒడిశా రైలు ప్రమాద బాధితులకు మద్దతు ప్రకటించారు. రిలయన్స్ ఫౌండేషన్ బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు నీతా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రిలయన్స్ ఫౌండేషన్ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్ నీతా అంబానీ అన్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే తమ ప్రత్యేక విపత్తు నిర్వహణ బృందం వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యల్ని అందించిందన్నారు.
రిలయన్స్ స్టోర్ల ద్వారా బాధిత కుటుంబాలకు వచ్చే ఆరు నెలల పాటు పిండి, చక్కర, పప్పు, బియ్యం, ఉప్పు, వంటనూనెతో సహా ఉచిత రేషన్ సరఫరాలను అందించనున్నట్లు రిలయన్స్ ఫౌండేషన్ ఒక ప్రకనటలో తెలిపింది. అంతేకాదు అంబులెన్స్‌లకు ఉచిత ఇంధనాన్ని, ప్రమాదంలో గాయపడిన వారికి ఉచిత మందులు, చికిత్స అందించనున్నట్లు ప్రకటించింది.