ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

రాజ‌మౌళి, మ‌హేష్ సినిమాలో ఆ బాలీవుడ్ హీరో?

రాజ‌మౌళి, మ‌హేష్ సినిమాలో ఆ బాలీవుడ్ హీరో?

బాహుబ‌లి, బాహుబ‌లి2 చిత్రాల‌తో పాటు ఆర్ఆర్ఆర్‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా తిరుగులేని క్రేజ్‌ని సొంతం చేసుకున్నాడు రాజ‌మౌళి. దీంతో ఈ మూవీ త‌ర్వాత రాజ‌మౌళి చేయ‌బోతున్న భారీ ప్రాజెక్టుపై ప్ర‌పంచ‌మంత‌టి దృష్టి ప‌డింది.

ఆర్ఆర్ఆర్ త‌ర్వాత రాజ‌మౌలి సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో ఓ భారీ యాక్ష‌న్ అడ్వెంచర్ మూవీని వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో నిర్మించ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్టులో బాలీవుడ్ హీరో ర‌ణ్‌బీర్ కపూర్ న‌టించ‌బోతున్నాడ‌ని వార్త‌లొస్తున్నాయి.   

మ‌హేష్ మూవీ కోస‌మే ర‌ణ్‌బీర్ బ్ర‌హ్మాస్త్రం ప్ర‌మోష‌న్స్‌లో కూడా హీరోహీరోయిన్ల‌తో తెలుగులోనే మాట్లాడిస్తున్నాడ‌ని, అలా మాట్లాడించి తెలుగు ఆడియన్స్‌కు ర‌ణ్‌బీర్‌ను ద‌గ్గ‌ర చేయాల‌నే ఉద్దేశంతోనే రాజ‌మౌళి ఈ ప్లాన్ వేశాడ‌ని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ కోసం ఆలియా భ‌ట్‌ను రంగంలోకి దింపి వ‌రల్డ్ వైడ్ క్రేజ్ తీసుకొచ్చిన జ‌క్క‌న్న ఈసారి ర‌ణ్‌బీర్‌తో ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇది ఎంత‌వ‌ర‌కు నిజ‌మ‌నేది తెలియాలంటే మాత్రం ఈ ప్రాజెక్ట్‌పై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చే వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :