ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

గాడ్ ఫాద‌ర్ గెస్టుగా పీకే?

గాడ్ ఫాద‌ర్ గెస్టుగా పీకే?

ఆచార్య డిజాస్ట‌ర్ కావ‌డంతో త‌న త‌ర్వాతి సినిమాల‌పై స్పెష‌ల్ కేర్ తీసుకుంటున్నాడు మెగాస్టార్ చిరంజీవి. మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో గాడ్ ఫాద‌ర్, బాబీ సినిమాలో వాల్తేరు వీర‌య్య సినిమాలు తీస్తున్నాడు చిరూ. వాల్తేరు వీర‌య్య ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుపుకుంటుండ‌గా, గాడ్ ఫాద‌ర్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్స్క్ జ‌రుపుకుంటోంది. మ‌ల‌యాళ రీమేక్ లూసిఫ‌ర్‌గా రూపొందిన గాడ్ ఫాద‌ర్ టీజ‌ర్ రీసెంట్‌గా చిరూ బ‌ర్త్‌డే రోజున రిలీజై ప్రేక్షకుల నుంచి మంచి స్పంద‌న పొందుతుంది. గాడ్ ఫాద‌ర్ అక్టోబ‌ర్ 5న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాకు మ‌రింత హైప్ క్రియేట్ చేసేందుకు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను తీసుకురావడానికి స‌న్నాహాలు చేస్తుంది చిత్ర బృందం. ఒకవేళ అన్నీ కుద‌రి, ప‌వ‌న్ ఫంక్ష‌న్‌కు వ‌స్తే మాత్రం మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులుండ‌వ‌నే చెప్పాలి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :