MKOne Telugu Times Youtube Channel

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఊరట

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఊరట

ఇస్లామాబాద్‌ కోర్టులో పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు ఊరట లభించింది. తనపై నమోదైన తీవ్రవాద ఆరోపణలకు చెందిన ఎనిమిది కేసుల్లో బెయిల్‌ లభించింది. ఇస్లామాబాద్‌లోని ఉగ్రవాద నిరోధక కోర్టు ఇమ్రాన్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు  చేసింది. దీంతో ఇమ్రాన్‌కు పాక్‌ మిలటరీ, ప్రభుత్వం నుంచి కాస్తా ప్రశాంతత దక్కినటైంది. కాగా పీటీఐ చీఫ్‌కు 8 వరకు బెయిల్‌ లభించిందని ఆయన న్యాయమూర్తి మహమ్మద్‌ అలి బోఖారి తెలిపారు. కాగా పాకిస్థాన్‌ ప్రధానిగా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డారని ఇమ్రాన్‌ ఖాన్‌పై దాదాపు 150 కేసులు నమోదయ్యాయి.  పదవిలో ఉన్నప్పుడు అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అల్‌ ఖదీర్‌ ట్రస్ట్‌ కేసును విచారిస్తున్న నేషనల్‌ అకౌంటబిలిటీ బ్యూరో ముందు ఇమ్రాన్‌ హాజరు కావాల్సి ఉంది. అయితే విచారణకు ముందే మళ్లీ తనని అరెస్టు చేసే అవకాశం 80 శాతం ఉందని పీటీఐ చీఫ్‌ హెచ్చరించారు. ఒకవేళ తనను కస్టడీలోకి తీసుకున్నా శాంతియుతంగా ఉండాలని ఆయన తన మద్దతుదారులకు సూచించారు.

 

 

Tags :