ప్రభుత్వంలో లేకపోతే నన్ను తట్టుకోలేరు

ప్రభుత్వంలో లేకపోతే నన్ను తట్టుకోలేరు

ప్రభుత్వంలో లేకపోతే నాకంటే ప్రమాదకరమైన వ్యక్తి ఇంకొకడు ఉండడు. నేను రొడ్డెక్కానంటే దాక్కోవడానికి మీకు చోటు కూడా ఉండదని పాకిస్థాన్‌ ప్రతిపక్షాలను ఉద్దేశించి ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ అన్నారు. ఆన్‌లైన్‌ వేదికగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో దేశ ప్రజలు అడిగిన ప్రశ్నలకు ఇమ్రాన్‌ బదులిచ్చారు. అయితే ద్రవ్యోల్బణం నియంత్రణలో ఇమ్రాన్‌ విఫలమయ్యారంటూ ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు మార్చి 23న లాంగ్‌ మార్చ్‌ నిర్వహణకు పిలుపునిచ్చాయి. దానికి గురించి ఓ వ్యక్తి ప్రశ్నించగా ఇమ్రాన్‌ ఘాటుగా బదులిచ్చి ప్రతిపక్షాలను హెచ్చరించారు.

 

Tags :