ASBL NSL Infratech

ఎన్టీఆర్ 30 లో డ్యుయల్ రోల్ లో కనిపించనున్న తారక్...

ఎన్టీఆర్ 30 లో డ్యుయల్ రోల్ లో కనిపించనున్న తారక్...

నందమూరి నట వారసుడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు తారక్. ఈ సినిమాతో  తారక్ పై ఆడియన్స్ అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఈ హీరో నెక్స్ట్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తారక్ అప్ కమింగ్ మూవీ నుండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సంబరపడిపోతున్నారు. ఈ తరుణంలోనే ఎన్టీఆర్ 30 సినిమాపై ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని తారక్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఆల్రెడీ ఈ ఇద్దరి కాంబోలో జనతా గారేజ్ చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో ఈ ప్రాజెక్ట్ పైన ఆడియన్స్ భారీగా అంచనాలు పెంచుకున్నారు. ఇక ఈ సినిమాలో తారక్ ద్విపాత్రాభినయం చేయబోతున్నారని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్ గా మారింది. స్క్రిప్ట్ డిమాండ్ చేయగా తండ్రి, కొడుకుగా ఎన్టీఆర్ డబల్ యాక్షన్ లో ప్రేక్షకులకి కనిపించి కనువిందు చేయడానికి రెడీ అవుతున్నారట.

ఎన్టీఆర్ 30 సినిమా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై కలిసి తెరక్కిస్తున్నారు. మోస్ట్ టాలెంటెడ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఆల్రెడీ ఆచార్య సినిమాతో ఆశించిన విజయాన్ని పొందలేకపోయింది శివ కొరటాల ఎన్టీఆర్ మూవీపై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టినట్టు తెలుస్తుంది. కథ పరంగా  కొన్ని మార్పులు చేయడం వల్లే ఈ ప్రాజెక్ట్ కాస్త లేట్ గా స్టార్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఫిబ్రవరి 24 నుండి సెట్స్ పైకి వెళ్లి రెగ్యులర్ షూటింగ్ ని జరుపుకుంటుంది అని మేకర్స్ తెలిపారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :