ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

వీర‌మ‌ల్లు రిలీజ్ డేట్ విష‌యంలో క‌న్ఫ్యూజ‌న్

వీర‌మ‌ల్లు రిలీజ్ డేట్ విష‌యంలో క‌న్ఫ్యూజ‌న్

తెలుగు సినిమాలు తీయ‌డం ఎప్పుడో ఆపేసిన అగ్ర నిర్మాత ఏఎం ర‌త్నం ఏ ముహూర్తంలో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు మొద‌లుపెట్టారో కానీ అప్ప‌టి నుంచి దీనికి పడుతున్న బ్రేకులు అన్నీ ఇన్ని కావు. క‌రోనా, లాక్ డౌన్, జ‌నసేన వ‌ల్ల ప‌వ‌న్ వ‌రుస‌గా డేట్లు ఇవ్వ‌లేక‌పోవ‌డం ఇలా ఈ సినిమాకు అన్నీ క‌ష్టాలే. ఈ సినిమా అస‌లు ఎప్పుడు అయిపోతుందో ఎవ‌రికీ అంతు చిక్క‌ట్లేదు. 

అప్ప‌ట్లో బాలీవుడ్ హీరో బాబీ డియోల్ వ‌చ్చాక వేగం పెరుగుతుందేమో అనుకుంటే కీల‌క‌మైన ఎపిసోడ్లు షూట్ చేశాక మ‌ళ్లీ ఆపారు. 70% పైగా సినిమా షూటింగ్ పూర్త‌యింద‌ని ఇన్ సైడ్ టాక్ ఉంది కానీ ద‌ర్శ‌కుడు క్రిష్ మాత్ర‌మే దీనికి సంబంధించిన క్లారిటీ ఇవ్వ‌గ‌ల‌రు. రిలీజ్ డేట్ కు సంబంధించిన సందిగ్ధ‌త మెల్ల‌గా దారులు మూసుకునేలా వ‌స్తుంది. ఈ స‌మ్మ‌ర్‌కి ప‌వ‌న్, సాయి ధ‌ర‌మ్ తేజ్‌ల డేట్ ఇప్ప‌టికే అనౌన్స్ చేశారు. 

కాబ‌ట్టి హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు స‌మ్మ‌ర్ మిస్ అయిన‌ట్లే. త‌ర్వాత ఇండిపెండెన్స్ డే ని టార్గెట్ చేద్దామంటే ఆగ‌స్టు 11కి భోళా శంక‌ర్‌ని ఇప్ప‌టికే లాక్ చేశారు. ద‌స‌రా అనుకుంటే రామ్- బోయ‌పాటి, టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు, లియోలు ఇప్ప‌టికే క‌ర్చీఫ్ వేశాయి. వీర‌మ‌ల్లు లాంటి పాన్ ఇండియ‌న్ ఫిల్మ్ కి దీపావ‌ళి, డిసెంబ‌ర్‌లు పెద్ద స్థాయిలో వ‌ర్క‌వుట్ అవ్వ‌వు. ఇక ఇవ‌న్నీ కాకుండా వీర‌మ‌ల్లుకి ఉన్న ఆప్ష‌న్ సంక్రాంతి ఒక‌టే. ఇప్ప‌టికే సంక్రాంతిని ప్రాజెక్ట్ కె, మ‌హేష్28 ఫిక్స్ చేసుకున్నాయి. 

గేమ్ చేంజ‌ర్, ఇండియ‌న్2 వీటిలో ఏదోక‌టి ప‌క్కా తోడ‌వుతుంది. మ‌రి వీర‌మ‌ల్లు రావాలంటే వీటిలో ఒక‌టి త‌ప్పుకోవాలి. అదంత ఈజీ కాదు. ఒక‌వేళ అది కూడా వ‌దిలేస్తే 2024 స‌మ్మ‌ర్ దాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. అస‌లు రిలీజ్ విష‌యంలో టీమ్ ఏం ప్లాన్ చేస్తుందో ఎవ‌రికీ అంతుప‌ట్టకుండా పోతుంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ అయితే జ‌రుగుతున్నాయి కానీ ఫ‌లానా టైమ్ అని టార్గెట్ పెట్టుకోకపోవ‌డ‌మే వీర‌మల్లుకి అస‌లు స‌మ‌స్య‌గా మారింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :