ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఎట్టకేలకు నిక్కీ తొలి విజయం...

ఎట్టకేలకు నిక్కీ తొలి విజయం...

వరుస పరాజయాలు, ఎదురుదెబ్బలతో ముందుకెళ్తున్న భారత సంతతి నాయకురాలు నిక్కీహేలీ.. ఎట్టకేలకు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష రేసులో తొలి విజయం అందుకున్నారు. డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియా (DC) ప్రైమరీ ఎన్నికల్లో ఆమె గెలుపొందారు. దీంతో రేసులో దూసుకుపోతున్న డొనాల్డ్‌ ట్రంప్‌ విజయ పరంపరకు కొంత మేర బ్రేక్‌ పడ్డట్లయింది. అయితే, ఆయన్ను అధిగమించడానికి వచ్చే మంగళవారం జరగనున్న పలు ప్రైమరీల్లో నిక్కీ భారీ గెలుపు నమోదు చేయాల్సి ఉంటుంది.

సొంత రాష్ట్రమైన దక్షిణ కరోలినాలోనూ నిక్కీకి ఓటమి తప్పలేదు. దీనికి తోడు పలు ప్రైమరీల్లో కూడా ఓటములు నిక్కీ ఖాతాలో చేరుతూ వస్తున్నాయి. అయినప్పటికీ రేసు నుంచి వైదొలగడానికి నిరాకరించారు. ఓవైపు ట్రంప్ ఆధిపత్యం కొనసాగుతున్నప్పటికీ.. ఆయనకు ప్రత్యామ్నాయం తానేనంటూ నిక్కీ ప్రచారం చేస్తున్నారు. డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియా డెమోక్రాట్లకు కంచుకోట. అక్కడ నమోదిత రిపబ్లికన్ల సంఖ్య 23,000 మాత్రమే. 2020లో అధ్యక్షుడు జో బైడెన్‌ తమ పార్టీ ప్రైమరీలో 92 శాతం ఓట్లు పొందారు.

మరోవైపు ట్రంప్‌ శనివారం మిసోరి, మిషిగన్‌, ఐడహో ప్రైమరీల్లోనూ నిక్కీపై ఘన విజయం సాధించారు. ఆయన నెగ్గిన ప్రతినిధుల సంఖ్య 244కు చేరుకుంది. హేలీ ఖాతాలో 24 మంది మాత్రమే ఉన్నారు. నవంబరులో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా నిలవాలంటే 1,215 మంది ప్రతినిధులను సొంతం చేసుకోవాలి. ప్రస్తుతం ట్రంప్‌ దూకుడు చూస్తుంటే ఈ సంఖ్యను ఆయన మంగళవారం జరిగే 15 రాష్ట్రాల ప్రైమరీల్లో సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :