ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఔషధం తయారు చేసిన అమెరికా.. ధర. 35 కోట్లు

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఔషధం తయారు చేసిన అమెరికా..  ధర. 35 కోట్లు

పిల్లల్లో జన్యుపరమైన లోపం కారణంగా తలెత్తే మెటాక్రోమాటిక్‌ ల్యూకోడి స్ట్రోఫీ(ఎంఎల్‌డీ) అనే అరుదైన వ్యాధికి లెన్మెల్డీ అనే ఔషధం అందుబాటులోకి వచ్చింది. దీని ధర 4.25 మిలియన్‌ డాలర్లు ( సుమారు రూ.35 కోట్లు). దీంతో ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఔషధంగా నిలిచింది. అమెరికాకు చెందిన ఆర్చర్డ్‌ థెరప్యూటిక్స్‌ అనే సంస్థ దీనిని తయారు చేసింది. ఎంఎల్‌డీ చికిత్సకు ఉపయోగించేందుకు అమెరికా ఔషద నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ ఈ ఔషదానికి అమోదముద్ర వేసింది. అమెరికాలో ఏటా 40 మంది పిల్లలు జన్యుపరమైన లోపంతో పుడుతున్నారు. దీని కారణంగా ఏడేళ్ల వయసు వచ్చేసరికి చనిపోతున్నారు. అరుదైన ఈ వ్యాధికి గతంలో ఏ చికిత్స లేదు. లెన్మెల్డీకి ఎఫ్‌డీఏ అనుమతి రావడంతో ఎంఎల్‌డీతో బాధపడే చిన్నారులను బతికించవచ్చు అని ఆర్చర్డ్‌ థెరప్యూటిక్స్‌ సహ-వ్యవస్థాపకుడు బాబీ గాస్పర్‌ తెలిపారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :