ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

LATA Sankranthi Sambaralu 2022

LATA Sankranthi Sambaralu 2022

2021 నవంబర్ నాటికి కొవిడ్ మరియు కొవిడ్ డెల్టా వేరియంట్ ప్రభావం తగ్గడం మరియు మన ప్రవాస తెలుగు వారందరు 90% వరకు కొవిడ్ వాక్సినేషన్ రెండు డోస్లు మరియు చాల వరకు బూస్టర్ డోస్లు పూర్తిచేసుకున్నందున లాటా కార్య వర్గం మరియు బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ నాయకత్వం లో దాదాపు అరవై మంది కార్యకర్తలతో ఈ సంవత్సరం సంక్రాంతి ని అంగరంగ వైభోగముగా జరపాలని నిర్ణయించి రెండు నెలలుగా కార్యకర్తలు మరియు ప్రతి సిటీ నుండి పిల్లలు, పెద్దలు అందరు సాధన చేస్తూ సన్నద్ధమవుతున్నారు.

అదే సమయంలో కొవిడ్ ఒమిక్రాన్ ప్రవేశించి, అతి వేగంగా వ్యాప్తి చెందే వేరియంట్ గా అన్ని దేశాల్ని మరొక్క సారి భయబ్రాంతులకు గురిచేసింది. క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ హాలిడేస్ కారణంగా ప్రయాణం చేయడం వలన మరియు సోషల్ గాధేరింగ్ వలన USA లో అందునా గ్రేటర్ లాస్ ఏంజెలెస్ మెట్రోలో నివాసముంటున్న మన తెలుగు కమ్యూనిటీలలో కూడా చాలా ఎక్కువుగా విస్తరిస్తూ ఉన్నది. 

ఈ నేపథ్యంలో లాటా భేషజాలకు తావివ్వకుండా తెలుగు కమ్యూనిటీ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం మాదిరిగా లాటా సంక్రాంతి సంబరాలను ఆన్లైన్లో లైవ్లో ప్రదర్శించడానికి నిర్ణయం తీసుకోవడమైనదని తెలియజేస్తున్నాము. మా ఈ నిర్ణయాన్ని మీరందరు హర్షిస్తూ ఆశీర్వదిస్తారని భావిస్తున్నాము.

ఈ సంవత్సరం లాటా సంక్రాంతి సంబరాలలో లోకల్ టాలెంట్ ను ప్రోత్సహిస్తూ ప్రతి సిటీ నుండి పిల్లలు, పెద్దల ప్రదర్శనలను రంగరించి మీకు ఆన్లైన్ లో నేరుగా ప్రసారం చెయ్యడానికి మరియు మీరు నేరుగా చూస్తున్న అనుభూతిని కలిగించడానికి లాటా కార్యకర్తలు చాలా కృషి చేస్తున్నారు, త్వరలోనే ఆన్లైన్ లో ప్రసారం చెయ్యబోయే తేదిని నిర్ణయించి తెలియపరుస్తాము.

మీరందరు కొవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నాము.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :