ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

కేజీఎఫ్-2 కి షాక్, రికార్డులు బద్దలుకొట్టిన కాంతారా....

కేజీఎఫ్-2 కి షాక్, రికార్డులు బద్దలుకొట్టిన కాంతారా....

ఏ ముహూర్తాన కాంతార సినిమా రిలీజ్ అయ్యిందో కానీ, 2 నెలలైనా కూడా థియేటర్స్ లో సందడి చేస్తూనే ఉంది. ఒకప్పుడు కన్నడ ఇండస్ట్రీ లో పాతిక నుండి యాభై కోట్లు సాధించడమే పెద్ద విషయం. అలాంటిది కేజీఎఫ్ సినిమా కోలీవుడ్ లో 100 కోట్లకు పైగా టర్నోవర్ సాధించింది.

కేజీఎఫ్ తప్ప మరే చిత్రం ఇలాంటి వసూళ్లు సాధించదు అని అందరు అనుకున్నారు. కర్నాటక లో కేజీఎఫ్ రికార్డులని బ్రేక్ చేయాలంటే కనీసం కొన్ని పదుల సంవత్సరాలు పడుతుందని అంతా భావించారు. అలాంటి సమయం లో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన " కాంతార " కేజీఎఫ్ 2 వసూళ్ల రికార్డ్స్ ని బ్రేక్ చేసింది.

అత్యధిక  ప్రేక్షకులు చుసిన సినిమాగా కాంతార ఇప్పటికే రికార్డు సృష్టించింది. కలెక్షన్స్ విషయం లోనూ తగ్గేదేలే అంటూ కేజీఎఫ్ 2 రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. రెండు నెలలు పూర్తైన తరుణంలో ఈ సినిమా ఇంకా సాలిడ్ కలెక్షన్స్ ని తీసుకొస్తూనే ఉంది. ఈ సమయంలో , కోలీవుడ్ వర్గాలు కాంతారా సినిమా కేజీఎఫ్ వసూళ్ల రికార్డ్స్ ని బ్రేక్ చేసింది అని అధికారికంగా ప్రకటించారు.

కేజీఎఫ్ 2 లాంగ్ రన్ లో 72 కోట్ల వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. కాంతార సినిమా ఆ కలెక్షన్స్ ని క్రాస్ చేసి , తాజాగా 172.35 కోట్ల వసూళ్ళని సాధించింది. వరల్డ్ వైడ్ గా చూస్తే కాంతార , కేజీఎఫ్ లో సగం కూడా రాబట్టలేకపోయింది. కానీ , స్థానికంగా కేజీఎఫ్ ని వెనక్కి నెట్టి కాంతార ముందు వరుసలో నిలిచింది. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :