ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

వీరికి ఏ అర్హత ఉందని రాజ్యసభకు? : కేఏ పాల్

వీరికి ఏ అర్హత ఉందని రాజ్యసభకు? : కేఏ పాల్

కుంభకోణాలు, కబ్జాలకు పాల్పడిన వారిని రాజ్యసభకు పంపించడం ఏంటని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అక్రమాలు, అవినీతి, కుటుంబ పాలన సాగుతోందన్నారు. ఈ తరహా పాలనను అంతం చేసేందుకు చివరి వరకు పోరాటం చేస్తాను. టీఆర్‌ఎస్‌లో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు నాయకులకు ఏ మాత్రం బుద్ది ఉన్నా పార్టీ నుంచి బయటకు రావాలన్నారు. అక్రమాల, అవినీతి పాలనను ప్రశ్నించేందుకు తెలంగాణను అప్పుల ఊబి నుంచి విడిపించి బంగారు తెలంగాణ చేయడమే నా లక్ష్యం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటనే రాజ్యసభకు ఎంపిక చేసిన ముగ్గురిని విత్‌డ్రా చేయించి అమరవీరుల కుటుంబాలకు చెందిన వ్యక్తులను సీట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఒకరు మైనింగ్‌ డాన్‌ మరొకరు రూ.500 కోట్ల స్కామ్‌లో పట్టుబడ్డ వ్యక్తి. ఇంకొక్కరు భూకబ్జాలు చేసిన వ్యక్తి వీరికి ఏ అర్హత ఉందని రాజ్యసభకు పంపుతారు? అని అన్నారు.

ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో మూడు రాజ్యసభ స్థానాలకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, హెటిరో చైర్మన్‌ బండి పార్థసారథిరెడ్డి, ఉమ్మడి వరంగల్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ నేత, గ్రానైట్‌ పరిశ్రమల అధినేత వద్దిరాజు రవచంద్ర (గాయత్రి రవి)లను సీఎం కేసీఆర్‌ అభ్యర్థులుగా ప్రకటించిన విషయం తెలిసిందే. 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :