ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

గత ఏడాది మాదిరిగానే... ఎలాంటి తేడా లేదు : బైడెన్

గత ఏడాది మాదిరిగానే... ఎలాంటి తేడా లేదు : బైడెన్

వయసురీత్యా వచ్చే ఆరోగ్య సమస్యలు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ కు ఆటంకంగా మారాయి. అధ్యక్ష ఎన్నికల వేళ తన ప్రత్యర్థి రిపబ్లికన్‌ పార్టీకి ప్రచారాస్త్రాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఏడాదికొకసారి నిర్వహించే వైద్యపరీక్షలు చేయించుకున్నారు. తాను మరీ యవ్వనంగా కనిపిస్తున్నానని వైద్యులు ఆశ్చర్యపోయారంటూ ఈ సందర్భంగా చమత్కరించారు. వైద్యులు కూడా ఆయన ఫిట్‌గా ఉన్నట్లు వెల్లడించారు. ప్రెసిడెంట్‌ బైడెన్‌ ఆరోగ్యంగా, చురుగ్గా ఉన్నారు. అధ్యక్ష బాధ్యతలు విజయవంతంగా నిర్వహించడానికి కావాల్సిన దృఢత్వాన్ని కలిగి ఉన్నారు. కొత్తగా ఎలాంటి సమస్యలు బయటపడలేదు అని పేర్కొన్నారు. పరీక్షల అనంతరం వైట్‌హౌస్‌కు చేరుకున్న బైడెన్‌ మీడియాతో మాట్లాడారు. గత ఏడాది మాదిరిగానే ఎలాంటి తేడా లేదు. నేను మరీ యవ్వనంగా కనిపిస్తున్నానని వారు అనుకుంటున్నారు అని సరదాగా వ్యాఖ్యలు చేశారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :