ASBL NSL Infratech

ఇదే జరిగితే ప్రపంచానికి ఎవరు నాయకత్వం : జో బైడెన్

ఇదే జరిగితే ప్రపంచానికి ఎవరు నాయకత్వం : జో బైడెన్

నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల కోసం అమెరికాలో ప్రచారం క్రమంగా ఊపందకుంటోంది. ఫ్లోరిడాలో జరిగిన ప్రచార సభలో డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ వాదిస్తున్నారని ఆరోపించారు. ఒక వేళ ఇదే జరిగితే ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారని ఆయన ప్రశ్నించారు.  ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు తన గెలుపు కోరుకుంటున్నాయని బైడెన్‌ తెలిపారు. జీ7, జీ20 వంటి అంతర్జాతీయ వేదికలపై ఆయా దేశాధినేతలు తన దగ్గరకు వచ్చి మీరే గెలవాలని తమ అభిప్రాయం చెబుతున్నారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం నిలబడుతుందని వారు భావిస్తున్నారని పేర్కొన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :