ASBL NSL Infratech

రివ్యూ: 'జయమ్మ... గా అలరించిన సుమ, ఆకట్టుకోని పంచాయతీ'

రివ్యూ: 'జయమ్మ... గా అలరించిన సుమ, ఆకట్టుకోని పంచాయతీ'

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.25/5
బ్యానర్..వెన్నెల క్రియేషన్స్
నటీనటులు.. సుమ, దేవి ప్రసాద్, దినేష్ కుమార్, కదంబాల షాలిని, కొండెపూడి జాయ్, నికిత,
గణేష్ యాదవ్, భువన్ సాలూరు, గేదెల త్రినాధ్, అమ్మ రామకృష్ణ, మాయానంద్,
ఠాకూర్ రెడ్డి మహేశ్వర రావు, డి హేమ త‌దిత‌రులు
సంగీతం..ఎంఎం కీరవాణి, సినిమాటోగ్రఫి.. అనూష్ కుమార్
నిర్మాత.. బలగ ప్రకాష్, దర్శకత్వం.. విజయ్ కుమార్ కలివరపు
విడుదల తేదీ: 06.05.2022

ఎన్నో ఏళ్లు బుల్లి తెరపై స్టార్ యాంకర్ గా రాణించిన సుమ వెండితెరపై రీఎంట్రీ చిత్రమిది. టాలీవుడ్ లో స్టార్ యాంకర్ గా కొనసాగుతున్న సుమ కనకాల చాలా కాలం తరువాత వెండితెరపై సందడి చేసిన సినిమా జయమ్మ పంచాయితి. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో వస్తున్న సినిమా జయమ్మ పంచాయితీ.  ఇన్నేళ్ల తరువాత సుమ ప్రధాన సినిమా వస్తుండటం మరోవైపు సుమ సినిమా అనే సరికి ఈసినిమాపై మొదటినుండీ ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఈసినిమా ఆ అంచనాలను అందుకుందా లేదా అన్నది తెలియాలంటే ఈరోజు( మే6) థియేటర్లో రిలీజ్ అయిన ఈసినిమా ఎంత వరకూ ఆడియన్స్ ను ఆకట్టుకుందో చూద్దాం.

క‌థ‌..
జయమ్మ (సుమ) తన భర్త మరియు పిల్లలతో కలిసి సంతోషంగా జీవిస్తుంటుంది. అలా హాయిగా వారి జీవనం సాగిపోతుండగా జయమ్మ భర్త (దేవి ప్రసాద్) అనుకోకుండా అనారోగ్యానికి గురవుతాడు. ఇక తన భర్త చికిత్స కోసం జయమ్మకు పెద్ద మొత్తంలోనే డబ్బు అవసరమవుతుంది. ఈక్రమంలో జయమ్మ తన భర్త  గుండె ఆపరేషన్ చేయాల్సి వస్తోంది. డబ్బులు లేని జయమ్మకు బాగా డబ్బు అవసరం అవుతుంది.   పరిష్కరించాలని గ్రామ పంచాయతీకి వెళుతుంది. మరోవైపు అదే సమయంలో గ్రామ పెద్దలు వేరే సమస్యను పరిష్కరించడంలో బిజీ అవుతారు. దీంతో జయమ్మ తన సమస్యకు పరిష్కారం చెప్పాల్సిందేనని ఊరి పెద్దలతో గొడవకు దిగుతుంది. ఆ తరువాత ఏం జరిగింది..మరీ ఆ డబ్బు కోసం జయమ్మ ఏమి చేసింది ? జయమ్మ సమస్యను ఎలా పరిష్కరించారు.. అసలు ఈ జయమ్మ పంచాయితీ ఏంటీ అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!

నటీనటుల హావభావాలు:
ఇక ఆర్టిస్ట్ ల పెర్ఫామెన్స్ విషయానికి వస్తే సుమ యాక్టింగ్ స్కిల్స్ గురించి తెలిసిందే కదా. జయమ్మ పాత్రలో సుమ జీవించేసింది. స్క్రీన్ పై మనకు జయమ్మ మాత్రమే కనిపిస్తుంది. ఆ ఫీల్ ను తీసుకొస్తుంది సుమ. కామెడీ సన్నివేశాల్లో తన కామిక్ ను ఎలాగైతే వదల్లేదో.. అలానే ఎమోషనల్ సీన్లలోనూ అంతే సీరియస్ గా నటించింది. పాత్రలోని తాపత్రయాన్ని, బాధను, వెటకారాన్ని సుమ చాలా చక్కగా పలికించింది.  ఇక ఈసినిమా తరువాత సుమ సినిమాల్లో కూడా బిజీ అవుతుందేమో. ఇక సుమ భర్తగా చేసిన దేవి ప్రసాద్ తన పాత్రను జస్టిఫై చేసి డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మిగ‌తా న‌టీన‌టులు కూడా అల‌రించారు.

సాంకేతికవర్గం పనితీరు:
విజయ్ కుమార్ కలివరపు దర్శకుడిగా ఈ సినిమాకు పూర్తి న్యాయం చేయలేదు. అలాగే రచయితగా కూడా ఆయన ఏ మాత్రం తన కథనంతో ఆకట్టుకోలేదు. సినిమా స్క్రిప్ట్ పై బాగా శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి అందించిన సంగీతం పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు. ఇక అనుష్క కుమార్  సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్ అయింది. సన్నివేశాలన్నీ చాలా సహజంగా సినిమా మూడ్ కి అనుగుణంగా నడుస్తాయి. ఆర్ట్ డైరెక్టర్ గురించి.. ఆర్ట్ డైరెక్టర్ ధను వేసిన సినిమా విలేజ్ సెటప్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. నిర్మాత ప్రొడక్షన్ లో ఎక్కడ కంప్రమైజ్ కాలేదు.

విశ్లేషణ:
నిజానికి ఈసినిమాకు అంత హైప్ రావడానికి ప్రధాన కారణం సుమ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా కొనసాగుతుందన్నది ఎప్పుడో అర్థమైపోయింది. పల్లెటూరి నేపథ్యాన్ని చక్కగా చూపించాడు దర్శకుడు. అయితే, సుమ నటనతో పాటు డిఫరెంట్ సినిమాగా కొన్ని అంశాల్లో ఈ చిత్రం ఆకట్టుకున్నా.. స్లో నేరేషన్, బోరింగ్ ట్రీట్మెంట్, బలమైన కాన్ ఫ్లిక్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ సీన్స్ లేకపోవడం, ఓవరాల్ గా చెప్పాలంటే మంచి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈసినిమాను అన్ని వర్గాలకు నచ్చుతుందని చెప్పలేము. యువతకు ఈసినిమా ఎంతవరకూ నచ్చుతుందో చెప్పలేము. జయమ్మ పంచాయితీ అంటూ గ్రామీణ నేపథ్యంలో ఓ విభిన్న కథాంశంతో వచ్చిన ఈ చిత్రం ఆకట్టుకోలేదు. కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. దాంతో ఈ సినిమా ఆకట్టుకోదు. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :