ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

న్యూజెర్సీలో ఘనంగా ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతి వేడుకలు

న్యూజెర్సీలో ఘనంగా ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతి వేడుకలు

న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్‌ నగరంలో స్థానిక రాయల్‌ ఆల్బర్ట్‌ ప్యాలెస్‌లో  శతాబ్ది గాయకుడు, గాన గంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఘంటసాల సంగీత కళాశాల ఇంటర్నేషనల్‌  (జీఎస్‌కేఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు అన్నా మధుసూదన్‌ రావు అధ్యక్షత వహించారు. వేదమంత్రోచ్ఛారణతో జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రార్థనా గీతాలతో ప్రారంభించిన ఈ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. ఘంటసాల సతీమణి సావిత్రి భారత్‌ నుంచి పంపిన వీడియో సందేశం ఆ మహా గాయకుడి పాటల జ్ఞాపకాలను అందరి మనుసుల్లోనూ నింపింది. ఘంటసాల కుమార్తె సుగుణ, ఆయన కోడలు కృష్ణకుమారి ఈ శత జయంతి వేడుకలు జయప్రదం కావాలని ఆకాంక్షిస్తూ తమ సందేశాలు పంపారు. ప్రపంచంలోనే అత్యధిక సంస్మరణ సభలు జరిగిన గాయకుడిగా ఘంటసాల చరిత్ర సృష్టించారని అలాంటి గొప్ప శతాబ్ది గాయకుడికి భారత అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న ఇవ్వాలని కృష్ణకుమారి అభ్యర్థించారు. అనంతరం ఆయనకు భారత రత్న ఇవ్వాలని కోరుతూ సభ్యుల సంతకాలు సేకరించి కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రం పంపించారు. ఘంటసాల ఆలపించిన 101 భగవద్గీత శ్లోకాలను 20మంది జీఎస్‌కేఐ సభ్యులు శ్రద్ధగా ఆలపించి శతాబ్దిగాయకుడికి ఘనంగా నివాళి అర్పించారు. ఇలాంటి పఠనం ప్రపంచంలోనే తొలిసారి జరిగినట్టు నిర్వాహకులు తెలిపారు.

శతజయంతి సందర్భంగా జీఎస్‌కేఐ సభ్యులు ఘంటసాల సంగీత దర్శకత్వం, గానంతో సమకూర్చిన 100 పాటల పల్లవులను శతగీత విభావరిగా పాడి ప్రేక్షకులను మైమరిపించారు. ఘంటసాల సంగీత దర్శకత్వం వహించిన రహస్యం సినిమాలోని గిరిజా కల్యాణం కూచిపూడి యక్షగానాన్ని చిన్మయి నృత్యాలయ న్యూజెర్సీ వారు శ్రీదేవి ముంగర, చిన్మయి ముంగర ఆధ్వర్యంలో ప్రదర్శించి ఆహూతులను  మంత్రముగ్ధుల్ని చేశారు. ఘంటసాల పాటలను ప్రముఖ సినీ గాయకుడు ఆదిత్య అయ్యంగార్‌ గానం చేసి శ్రోతలకు వీనులవిందు చేశారు. ఈ వేడుకలకు ప్రత్యేక అతిథులుగా విచ్చేసిన మద్దుల సూర్యనారాయణ, గంటి భాస్కర్‌, ఇతర ప్రముఖులు జీఎస్‌కేఐ చేస్తున్న సేవలను ప్రశంసించారు. ఘంటసాల శత జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించడానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికీ  ప్రెసిడెంట్‌ అన్నా మధుసూదనరావు, ఇతర ట్రస్టీలు పుష్పకుమారి, రవితేజ కృతజ్ఞతలు తెలిపారు. ముసుకు మహేందర్‌ రెడ్డి, వెంపరాల సుజాత, తాడేపల్లి రేణు, టీపీ శ్రీనివాసరావు, కనకమేడల శివశంకరరావు, ఆళ్ళ రామిరెడ్డి, గూడూరు ప్రవీణ్‌, మాడిశెట్టి రంగారావు, సన్నిధి సుబ్బారావు, తడికమళ్ళ ప్రవీణ్‌, గూడూరు శ్రీనివాస్‌, చెరువు విద్యాసాగర్‌, గిడుగు సోమశేఖర్‌.. తదితరులు ఈ వేడుకలు విజయవంతంగా నిర్వహించడంలో సహకరించారు. 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :