ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

పుష్ప‌2లో అంచ‌నాల‌కు మించి భ‌న్వ‌ర్ సింగ్ పాత్ర‌

పుష్ప‌2లో అంచ‌నాల‌కు మించి భ‌న్వ‌ర్ సింగ్ పాత్ర‌

పుష్ప సినిమాతో టాలీవుడ్ కు ప‌రిచ‌య‌మైన ఫహ‌ద్ ఫాసిల్ ఆ త‌ర్వాత ఎన్నో డ‌బ్బింగ్ సినిమాల ద్వారా టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యాడు. భ‌న్వ‌ర్ సింగ్ షెకావ‌త్ గా పోలీస్ పాత్ర‌లో క‌ళ్ల‌తోనే క్రూర‌త్వాన్ని ప‌లికించే పాత్ర‌లో ఫ‌హ‌ద్ ఆడియ‌న్స్ ను మెప్పించిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే పుష్ప‌లో త‌న క్యారెక్ట‌ర్ ను సుకుమార్ గంట‌లోపే కుదించాడు.

స్టోరీ ప్ర‌కారం ఫ‌హ‌ద్ పాత్ర ఎంట్రీ చాలా లేట్. అయినా స‌రే త‌న ఉనికిని చాటుకోవ‌డంలో ఫ‌హ‌ద్ స‌క్సెస్ అయ్యాడు. మ‌రి పుష్ప‌2లో ఫ‌హ‌ద్ క్యారెక్ట‌ర్ లెంగ్త్ ఎంత ఉంటుంద‌నేది ఇప్పుడు ఫ్యాన్స్ లో చాలా ఆస‌క్తిక‌రంగా మారింది. ఇన్‌సైడ్ టాక్ ప్ర‌కారం, పుష్ప‌2లో ఈసారి ఫ‌హ‌ద్ న‌ట విశ్వ‌రూపం చూడ‌బోతున్నామ‌ట‌. పుష్ప చేతిలో భంగ‌ప‌డ్డ అన‌సూయ‌, ధ‌నుంజ‌య్, సునిల్ ఒక గ్రూప్ గా ఏర్ప‌డి తోడుగా జ‌గ‌ప‌తిబాబుని తెచ్చుకుంటారు.

వీళ్లంద‌రితో క‌లిసి స్మ‌గ్లింగ్ మాఫియాను వెనుక నుండి న‌డిపిస్తూనే ప‌గ‌తో ర‌గ‌లిపోతున్న భ‌న్వ‌ర్ సింగ్ ఛాన్స్ దొరికిన‌ప్పుడల్లా పుష్ప‌ను దారుణంగా దెబ్బ కొడుతూ ఉంటాడ‌ట‌. కొన్ని సార్లు ఆ దెబ్బ తీవ్ర‌త మ‌రీ ఘోరంగా ఉంటుంద‌ని తెలుస్తోంది. కాబ‌ట్టి ఈసారి పుష్ప‌2లో భ‌న్వ‌ర్ సింగ్ షెకావ‌త్ క్యారెక్ట‌ర్ అంచ‌నాల‌ను మించే ఉంటుంద‌ని స‌మాచారం. పుష్ప‌2 ఎన్నో భారీ అంచ‌నాల మ‌ధ్య ఆగ‌స్ట్ 15న రిలీజ్ కాబోతుంది. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :