ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ప్రపంచ కుబేరుడిగా మళ్లీ ఎలాన్ మస్క్

ప్రపంచ కుబేరుడిగా మళ్లీ ఎలాన్ మస్క్

ప్రపంచ ధనవంతుల జాబితాలో టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ మళ్లీ తొలి స్థానానికి చేరుకున్నారు. ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న ఎల్‌వీఎంహెచ్‌ అధినేత బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ సంపద 2.6 శాతం కుగింది. దీంతో బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ సూచీ లో మస్క్‌ పైకి ఎగబాకారు. ఆర్నాల్ట్‌ తొలిసారి గత డిసెంబరులో మస్క్‌ను దాటేసి మొదటిస్థానానికి చేరారు. టెక్‌ ఇండస్ట్రీ భారీ ఒడుదొడుకులు ఎదుర్కోవడం, ట్విటర్‌ కొనుగోలు తర్వాత పరిణామాల నేపథ్యంలో టెస్లా షేరు విలువ అప్పట్లో భారీగా పతనమైంది. దీంతో మస్క్‌ వ్యక్తి గత సంపద తరిగిపోయింది. మరోవైపు అదే సమయంలో కరోనా పరిస్థితులు చక్కబడడంతో విలాసవంత వస్తువుల కొనుగోళ్లు పుంజుకొన్నాయి. ఫలితంగా ఎల్‌వీఎంహెచ్‌ షేర్లు రాణించాయి. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :