అధ్యక్ష ఎన్నికల బరిలోకి ట్రంప్... ప్రచారం ప్రారంభం

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2024లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగారు. ముందస్తు ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో మద్దతు కూడగట్టేందుకు తొలుత దక్షిణ కరోలినాకు బయలుదేరిన ఆయన న్యూహేంప్షైర్లో కొద్దిసేపు ఆగి ప్రచారాన్ని ప్రారంభించారు. అధ్యక్ష అభ్యర్థిగా ప్రచారాన్ని ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం అని పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రకటించారు. గతంలో కంటే తాను చాలా నిబద్ధతో ఉన్నానని తెలిపారు. మెంఫిస్ నగరంలో పోలీసుల హింస కారణంగా టైర్ నికోల్స్ అనే నల్లజాతీయుడు చనిపోవడం చాలా బాధాకరమని ట్రంప్ అన్నారు.
Tags :