ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఆ డైరెక్ట‌ర్ ఈసారి హిట్ కొట్ట‌క‌పోతే క‌ష్ట‌మే!

ఆ డైరెక్ట‌ర్ ఈసారి హిట్ కొట్ట‌క‌పోతే క‌ష్ట‌మే!

పిట్ట‌గోడ అనే కామెడీ సినిమాతో డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌య‌మైన అనుదీప్ బాక్సాఫీస్ వ‌ద్ద ఫ్లాప్ అందుకున్నాడు. దీంతో అనుదీప్‌కు మ‌రో ఛాన్స్ రావ‌డానికి ఐదేళ్లు ప‌ట్టింది. అయితేనేం రెండో సినిమా వైజ‌యంతీ మూవీస్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ‌లో చేసే ఛాన్స్ కొట్టేశాడు. న‌వీన్ పోలిశెట్టి, ఫారియా అబ్దుల్లా హీరో హీరోయిన్లుగా జాతిర‌త్నాలు తీసి, బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుని అంద‌రినీ షాక్ అయ్యేలా చేశాడు. 

స్టోరీ పెద్ద‌గా లేక‌పోయినా కామెడీతో జ‌నాల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌గ‌లిగాడు. దీంతో మూడో సినిమాను శ్రీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్, సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, శాంతి టాకీస్ ప‌తాకాల‌పై కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయ‌న్ హీరోగా ప్రిన్స్ అనే ద్విభాషా చిత్రం చేసే ఛాన్స్ అందుకున్నాడు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. అయితే దీనికంటే ముందు అనుదీప్ ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో సినిమాకు క‌థ‌, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించాడు. ఈ చిత్రానికి కూడా జాతిర‌త్నాలు ఫార్ములాను రిపీట్ చేశాడు కానీ వ‌ర్క‌వుట్ కాక బాక్సాఫీస్ వ‌ద్ద ఫ్లాప్‌గా నిలిచింది. 

దీంతో ప్ర‌తిసారి క్రింజ్ కామెడీ వ‌ర్క‌వుట్ అవ‌ద‌ని ఇలానే ఉంటే క‌ష్ట‌మే అని ఓ రేంజ్ ట్రోల్స్ వస్తున్నాయి అనుదీప్ మీద‌. ఇలాంటి ప‌రిస్థితుల్లో ప్రిన్స్ సినిమా రిజ‌ల్ట్ అనుదీప్ కెరీర్‌కు ఎంతో కీల‌కం కానుంది. ఈ సినిమాతో అనుదీప్ ఎలాగైనా హిట్ కొట్టాల్సిన ప‌రిస్థితి. ఈ సారి కూడా ఎదురుదెబ్బ త‌గిలితే అనుదీప్ కెరీర్ సందిగ్ధంలో ప‌డ‌టం ఖాయమ‌నే చెప్పాలి. 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :