ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

బాలయ్య బాబుతో సినిమా చేయడం ఆషా మాషి కాదు ఒళ్ళు దెగ్గర పెట్టుకుని పర్ ఫెక్ట్ కథతో వెళ్ళాలి : అనిల్ రావిపూడి

బాలయ్య బాబుతో సినిమా చేయడం ఆషా మాషి కాదు ఒళ్ళు దెగ్గర పెట్టుకుని పర్ ఫెక్ట్ కథతో వెళ్ళాలి : అనిల్ రావిపూడి

నందమూరి బాలకృష్ణ  గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘వీరసింహారెడ్డి’ చిత్రంలో నటిస్తుండగా.. ఈ ప్రాజెక్ట్ తర్వాత  ‘ఎఫ్ 2’కు సీక్వెల్‌గా తెరకెక్కిన ‘ఎఫ్ 3’ ద్వారా కమర్షియల్ హిట్ కొట్టిన యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తదుపరి చిత్రాన్ని నందమూరి బాలకృష్ణతో చేయనున్నాడు. ప్రస్తుతం బాలయ్య. ఈ క్రమంలోనే తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ అప్‌కమింగ్ కామెడీ షోలో జడ్జిగా పాల్గొంటున్న అనిల్.. నందమూరి హీరో కల్యాణ్ రామ్‌ హీరోగా ‘పటాస్’ సినిమా ద్వారా దర్శకుడిగా అరంగేట్రం చేసిన అనిల్ రావిపూడి.. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా ‘సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్2’ వంటి హిట్లతో ఏకంగా సూపర్ స్టార్ మహేశ్ బాబును డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్ అనిపించుకున్న అనిల్.. అయితే  రీసెంట్ ఇంటర్వ్యూలో బాలయ్య దగ్గర కథ విషయంలో ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తాజా ఇంటర్వ్యూలో బాలయ్యతో సినిమా గురించిన అప్‌డేట్స్ పంచుకున్నాడు అనిల్. కథ చాలా బాగా వచ్చిందన్న స్టార్ డైరెక్టర్.. ఫైనల్ స్క్రిప్ట్ పట్ల సంతోషంగా ఉన్నామని తెలిపాడు. ‘బాలయ్యతో సినిమా అంటే అభిమానుల అంచనాలు నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. ఆయన లాంటి సూపర్ పవర్‌తో ప్రాజెక్ట్ అంటే ఆ మాత్రం అంచనాలు ఉండటం సహజం. ఇదొక ప్రత్యేకమైన కాంబినేషన్, సినిమా కూడా అంతే ప్రత్యేకంగా ఉంటుంది’ అన్నారు. అలాగే ఆయనతో ప్రాజెక్ట్ పట్ల తాను ఎలాంటి ఒత్తిడికి గురికావడం లేదని పేర్కొన్నాడు. చిన్నప్పటి నుంచి బాలయ్య సినిమాలు చూస్తూ పెరిగినందున తన బాడీ లాంగ్వేజ్‌కు ఏది సూట్ అవుతుంది? ఏది కాదో పర్‌ఫెక్ట్‌గా ఎనలైజ్ చేయగలనని చెప్పాడు. పైగా కథలోని బీట్స్ నచ్చితేనే బాలయ్య ఆ ప్రాజెక్ట్‌ ఓకే చేస్తాడు కాబట్టి, ఆయనతో సినిమా చేయడం ఆషా మాషి కాదు ఆయన్ని మెప్పించాలంటే కథను జాగ్రత్తగా(ఒళ్లు దగ్గరపెట్టుకొని) సిద్ధం చేయాల్సి ఉంటుందన్నాడు.  

అంతేకాదు కథకు ఆయన ఆమోదం తెలిపితే ఇక సగం సినిమా పూర్తయినట్లే అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌గా కొనసాగుతున్న అనిల్, తన విజయ రహస్యం ఏంటో ఈ సందర్భంగా చెప్పేశాడు. తన సినిమా ఏదైనా ఫస్ట్ డే, ఫస్ట్ షో థియేటర్‌లో చూడగానే అందులో చేసిన తప్పులన్నీ అర్థమవుతాయని, ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని ఉదాహరణగా తీసుకున్నాడు. ట్రైన్ ఎపిసోడ్‌లో బండ్ల గణేష్‌ ట్రాక్‌‌ను షూటింగ్‌ టైమ్‌లో ఎంజాయ్‌ చేసినప్పటికీ థియేట‌ర్‌లో చూస్తుంటే మాత్రం లెంగ్త్ ఎక్కువైనట్లు అనిపించిందన్నాడు. ఆ సింగిల్ ట్రాక్.. మొత్తం ఎపిసోడ్‌పై ఎఫెక్ట్ చూపిందని వెల్లడించాడు. సినిమా హిట్ అయినప్పటికీ అందులో చేసిన తప్పులను గుర్తించి, తదుపరి చిత్రంలో వాటిని రిపీట్ చేయకుండా ఉండటం చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డాడు. మరి బాలయ్యతో సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :