ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

డెల్ కీలక నిర్ణయం.. వారికి ప్రమోషన్లు ఉండవ్!

డెల్ కీలక నిర్ణయం..  వారికి  ప్రమోషన్లు ఉండవ్!

ప్రముఖ కంప్యూటర్ల తయారీ సంస్థ డెల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ నిబంధనల ప్రకారం ఆఫీసుకు రానివారికి ప్రమోషన్లు ఉండవని తేల్చి చెప్పినట్లు తెలిసింది. ఇప్పటికే ఇంటి నుంచి పనిచేయాలనుకునేవారు అదే విధానాన్ని కొనసాగించొచ్చని డెల్‌ తమ ఉద్యోగులకు ఫిబ్రవరిలో జారీ చేసిన మెమోలో తెలియజేసింది. కానీ, వారెవరినీ ప్రమోషన్లకు పరిగణించబోమని తేల్చి చెప్పింది. ప్రస్తుతం కంపెనీలో హైబ్రిడ్‌ పని విధానం కొనసాగుతోంది. దీని ప్రకారం ప్రతి ఉద్యోగి వారంలో కనీసం మూడు రోజులు ఆఫీసుకు రావాలి.  అలా రానివారందరినీ ఇంటి నుంచి పనిచేస్తున్నట్లు భావించాల్సి వస్తుందని కంపెనీ తెలిపింది. వారెవరికీ పదోన్నతులు ఉండవని స్పష్టం చేసింది. అలాగే జాబ్‌ రోల్‌  మార్చుకునే అవకాశం సైతం ఇవ్వబోమని చెప్పింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :