ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

సుకుమార్ శిష్యుడు అనిపించాడుగా

సుకుమార్ శిష్యుడు అనిపించాడుగా

టాలీవుడ్‌లో సీనియ‌ర్ డైరెక్ట‌ర్ల ద‌గ్గ‌ర అసిస్టెంట్ డైరెక్ట‌ర్లుగా ప‌నిచేసిన వాళ్ల‌లో చాలా మంది ఇప్పుడు డైరెక్ట‌ర్లుగా మారుతున్నారు. ఈ కోవ‌కు చెందిన వారిలో సుకుమార్ ద‌గ్గ‌ర శిష్యులుగా పనిచేసిన వాళ్లే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నారు. ఉప్పెన సినిమాతో బుచ్చిబాబు డైరెక్ట‌ర్ గా ప‌రిచ‌య‌మై, బెస్ట్ డెబ్యూ కొట్టాడు. 100 కోట్ల గ్రాస్ లిస్ట్ లో కూడా చేరాడు. 

ఇప్పుడు సుకుమార్ కు మ‌రో శిష్యుడిగా శ్రీకాంత్ ఓదెల ద‌స‌రా అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ద‌స‌రాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన శ్రీకాంత్ ఇంత‌కుముందు సుకుమార్ ద‌గ్గ‌ర నాన్న‌కు ప్రేమ‌తో, రంగ‌స్థ‌లం సినిమాల‌కు ప‌నిచేశాడు. సుకుమార్ రంగ‌స్థ‌లం రిలీజైన రోజే ద‌స‌రా కూడా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నాడు శ్రీకాంత్. 

అంతే కాదు త‌న మేకింగ్ స్టైల్‌తో త‌న గురువును చాలా వ‌ర‌కు గుర్తు చేశాడు శ్రీకాంత్. ద‌స‌రాలో కొన్ని సీన్స్, మేకింగ్ స్టైల్స్, ద‌స‌రాను శ్రీకాంత్ హ్యాండిల్ చేసిన తీరు, క్యారెక్ట‌ర్లు అన్నీ రంగ‌స్థ‌లంను పోలి ఉన్నాయి. ఈ సినిమా చూసిన చాలా మంది శ్రీకాంత్‌ని తెగ పొగుడుతున్నారు. కొంద‌రైతే అస‌లు ఇది శ్రీకాంత్ మొద‌టి సినిమానేనా అని ఆశ్చ‌ర్య‌పోతున్నారు. 

బుచ్చిబాబు లాగానే శ్రీకాంత్ కూడా ద‌స‌రాతో 100 కోట్ల గ్రాస్ కొల్ల‌గొడితే, ఇద్ద‌రు గొప్ప డైరెక్ట‌ర్లను టాలీవుడ్ కు అందించిన ఘ‌న‌త సుకుమార్ అకౌంట్ లో ప‌డుతుంది. ఇప్ప‌టికే పాజిటివ్ టాక్‌తో మంచి మార్కులు అందుకుంటున్న శ్రీకాంత్, ద‌స‌రాతో ఎన్ని కోట్లు క‌లెక్ట్ చేస్తాడో చూడాలి.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :