ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

కాంగ్రెస్ మేనిఫెస్టో..?

కాంగ్రెస్ మేనిఫెస్టో..?

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆలిండియా కాంగ్రెస్ పాంచ్ న్యాయ్ పేరుతో ఐదు గ్యారెంటీలను సిద్ధం చేసింది.. ఈ మేనిఫెస్టోకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. హిస్సేదారి న్యాయ్, కిసాన్ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, యువ న్యాయ్, నారీ న్యాయ్ పేరుతో వీటిని రూపొందించినట్లు సమాచారం. మరీ ముఖ్యంగా వెనకబడిన వర్గాలు, శ్రామికులు, రైతులు, యువత, మహిళలను టార్గెట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. తన మేనిఫెస్టోలో వారికే పెద్దపీట వేసింది.

కాంగ్రెస్ మేనిఫెస్టోలోని 5 అంశాలు ఇవే

హిస్సేదారి న్యాయ్ :

1. సామాజిక, ఆర్థిక కుల గణన
2. ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్ల కల్పనపై 50% సీలింగ్ తొలగింపు
3. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కోసం స్పెషల్ బడ్జెట్
4. జల్ జంగల్ జమీన్ పై చట్టబద్ధహక్కులు
5. గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను షెడ్యూల్డ్ ఏరియాలో గుర్తింపు

కిసాన్ న్యాయ్ :

1. స్వామినాథన్ ఫార్ములా ప్రకారం పంటలకు గిట్టుబాటు ధర చట్టబద్ధత
2. రుణమాఫీ కమిషన్ ఏర్పాటు
3. పంట నష్టపోయిన 30 రోజుల్లో బీమా పరిహారం చెల్లింపు గ్యారెంటీ
4. రైతులు లబ్ధి పొందేలా ఎగుమతి దిగుమతి విధానం
5. వ్యవసాయ పరికరాలపై జిఎస్టి మినహాయింపు

శ్రామిక్ న్యాయ్ :

1. రైట్ టు హెల్త్ చట్టం
2. రోజుకు 400 రూపాయల కనీస వేతనం- ఉపాధి హామీ పథకంలో సైతం
3. పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం అమలు
4. అసంఘటిత రంగ కార్మికులకు జీవిత బీమా యాక్సిడెంట్ భీమ
5. ప్రభుత్వంలో కాంట్రాక్టు ఉద్యోగాల నియామకాలు నిలుపుదల

యువ న్యాయ్:

1. కేంద్రాన్ని ప్రభుత్వంలో 30 లక్షల ఉద్యోగాల భర్తీ
2. యువతకు ఏడాది అప్రెంటిస్ట్ షిప్ - ఏడాదికి లక్ష రూపాయలు నెలకు 8500 చెల్లింపు
3. పేపర్ లీక్ అరికట్టేందుకు కఠినమైన చట్టం
4. గిగ్ వర్కర్ల సామాజిక భద్రతకు చర్యలు
5. యువత స్టార్టప్ కోసం ఐదు వేల కోట్ల నిధి కేటాయింపు

నారీ న్యాయ్ :

1. ప్రతి పేద కుటుంబంలోని ఒక మహిళకు ఏడాదికి లక్ష రూపాయలు
2. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు
3. ఆశ అంగన్వాడి మిడ్ డే మీల్ వర్కర్స్కు డబుల్ శాలరీ కాంట్రిబ్యూషన్
4. మహిళల హక్కుల రక్షణ కోసం అధికారి మైత్రి ఏర్పాటు
5. వర్కింగ్ విమెన్ కోసం సావిత్రిబాయి పూలే పేరుతో రెట్టింపు హాస్టల్స్.

కర్నాటక, తెలంగాణలో గ్యారెంటీలు విజయవంతం కావడం, జనం ఓట్లేయడంతో .. జాతీయ స్థాయిలోనూ ఇదే పంథా అవలంభిస్తోంది. వీటన్నింటికీ కోట్లాది రూపాయలు
బడ్జెట్ అవుతుంది. అయితే అధికార పగ్గాలు రావాలంటే ప్రజలకు తాయిలాలు వేయాల్సిన అవసరాన్ని గుర్తించింది కాంగ్రెస్. అయితే మోడీ చరిష్మా ముందు ఈ
పాంచ్ న్యాయ్ ఎంతవరకూ నిలుస్తాయో వేచి చూడాలి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :