ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

రేవంత్ పొలిటికల్ గేమ్..

రేవంత్ పొలిటికల్ గేమ్..

మొన్నటివరకూ ఒక ఎత్తు.. ఇప్పటి నుంచి మరో ఎత్తంటున్న తెలంగాణ పీసీసీ చీఫ్,సీఎం రేవంత్ రెడ్డి. పార్టీ గేటు తెరిచాం.. ఇక నుంచి నా రాజకీయం రూపం చూపెడతానంటూ విపక్షాలకు హెచ్చరికలు జారీ చేశారు. అధికారంలోకి వచ్చి వందరోజులు పూర్తయిన సందర్భంగా మీట్ ద మీడియాలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. పదేళ్ల పాటు కేసీఆర్ నయా నిజాంలా వ్యవహరించారని విమర్శించారు. నిజాం విధానాల నకలును కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేశారని ఆరోపించారు. అందుకే ప్రజలు కేసీఆర్ విధానాలను వ్యతిరేకించి.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారన్నారు.

100 రోజుల పరిపాలనలో తాము చేరికల జోలికి వెళ్లలేదని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీఆర్ఎస్, బీజేపీలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ కుట్రలను తిప్పికొట్టేందుకు తాము కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఎన్నికల్లో ప్రజల తీర్పును గౌరవించకుండా.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలనే ఆలోచనతో బీఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందంతో పనిచేస్తున్నాయని మండిపడ్డారు రేవంత్. కేసీఆర్ నుంచి కడియం శ్రీహరి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలలే ఉంటుందని మాట్లాడుతున్నారని.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కూడా ఎన్నికలయ్యాక ప్రభుత్వం కూలుతదని మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ 100 రోజుల పాలనలో తాము ఫిరాయింపులను ప్రోత్సహించలేదని అన్నారు.

వాళ్లు ప్రభుత్వాన్ని పడగొడితే తాము చూసుకుంటూ కూర్చొవాలా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని పెద్దలు చెప్పారని.. తాము కొట్టకుండా ఉండమని చెప్పారు. తాము ఈరోజు ఆట మొదలుపెట్టామని అన్నారు. ఎన్నికల నగరా మోగిందని, తాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాజకీయ రూపం చూపెడతానని, ఈరోజు నుంచి పని మొదలుపెడతామని చెప్పారు. ఈరోజు ఒక్క గేటును ఓపెన్ చేశామని చెప్పారు.

ఓ విధంగా చెప్పాలంటే గతంలో కేసీఆర్ అనుసరించిన విధానాలను .. రేవంత్ రెడ్డి కూడా తూచా తప్పకుండా అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. తాము అధికారంలోకి వచ్చినా ప్రతిపక్షాలను నిలువునా చీల్చేసి, విపక్షం లేకుండా చేయాలని కేసీఆర్ ప్రయత్నించారు.టీడీఎల్పీని అయితే పార్టీలో విలీనం చేసుకున్నారు. ఇంత చేసిన కేసీఆర్, గులాబీదళంపై..ఇప్పుడు అదే స్ట్రాటజీని రేవంత్ రెడ్డి అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈచర్యతో గులాబీనేతలు ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :