ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

కరెప్షన్ లేని ఏకైక రంగం సినిమా : మెగాస్టార్

కరెప్షన్ లేని ఏకైక రంగం సినిమా : మెగాస్టార్

గోవా లో 2022 IFFI ముగింపు వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరు చేసిన చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో ఆసక్తిని రేపింది. కరెప్షన్ లేని ఒకేఒక రంగం సినీరంగం, ఈ రంగం లోకి యువతరం వెల్లువలా రావాలని ఆయన అన్నారు. ఇక్కడ నిజాయితీగా పని చేసే నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఎదిగేందుకు ఆస్కారం ఉందని భరోసానిస్తూ ఆయన మాట్లాడారు.

ఈ సంచలన వ్యాఖ్యలు చేస్తూ మెగాస్టార్ ఎంతో భావోద్వేగానికి లోనైనట్లు తెలుస్తుంది. టాలీవుడ్ లో హీరోగా తన హవాని కొనసాగిస్తున్న రోజుల్లోనే మెగాస్టార్ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి ప్రజలకి సేవ చేయాలని భావించారు. కానీ, స్వతహాగా సున్నిత మనస్కుడైన చిరంజీవికి కుయుక్తులు రాజకీయ రంగం అస్సలు సెట్ కాలేదు.

తెలుగుదేశం పార్టీ కి చెందిన ప్రముఖ ఎడిటర్ చిరంజీవి రాజకీయాల్లోని లోపాలని ఎత్తి చూపుతూ, ఆయన రాజకీయాలకి ఎందుకు సెట్ అవ్వరో కూడా చక్కగా విశ్లేషించారు. అందుకు తగ్గట్టే పాలిటిక్స్ లో చిరు ఇమడలేకపోయారనేది అందరికి తెలిసిన వాస్తవం. చివరికి ఆయన నిజాయితీగా పని చేసే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ సేవలలో సైతం అవినీతి ఉందనే శత్రు ప్రచారం కి చిరు ఎంతగా హర్ట్ అయ్యారో తెలిసిన విషయమే.

పాలిటిక్స్ కోసం సినిమాలని ఎట్టి పరిస్థులలో వదులుకోనని మెగాస్టార్ IFFI లో ప్రతిజ్ఞ చేశారు . నేను తెలుగు చిత్ర అభిమానుల ప్రేమకి బానిసను...! అని ఆయన అన్నారు. తన ప్రసంగంలో వేదిక ముందు కూర్చున్న అక్షయ్ కుమార్ ని, అతని ఫిట్ నెస్ ని ప్రశంసించారు.

"ప్రపంచం లో ఉన్న తెలుగు సినిమా అభిమానుల ప్రేమకి  నేను బానిసను, నిజానికి ఆ ప్రేమ వల్లే నేను ఇంత దూరం రాగలిగాను, ఈ అవార్డుని సాధించగలిగాను, మీ ప్రేమకి నేను ఎల్లప్పుడు కృతజ్ఞుడనై ఉంటానని, మళ్ళీ ఎప్పుడూ సినీ పరిశ్రమని వదిలి పెట్టనని నా అభిమానులకి హామీ ఇస్తున్నానని " మెగాస్టార్ ఈ ముగింపు వేడుకలో ఎమోషనల్ అయ్యారు...

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :