ASBL NSL Infratech

కోకో దీవుల వివాదమేంటి..?

కోకో దీవుల వివాదమేంటి..?

కోకో ఐలాండ్స్‌..

భారత దేశం చుట్టూ అనేక దీవులు ఉన్నాయి. అవన్నీ చాలా ఏళ్లుగా భారత ఆధీనంలోనే ఉన్నాయి. అందులో కోకో ఐలాండ్స్ కూడా ఉన్నాయి. మయన్మార్‌కు అతి సమీపంలో ఉన్న భారతీయ దీవులు అయిన కోకో ఐల్యాండ్స్‌ను మన పొరుగున ఉన్న మయన్మార్‌కు అప్పగించారు నాటి ప్రధాని నెహ్రూ. ఎప్పుడు సైనిక పాలనలో ఉండే మయన్మార్‌.. తన స్వప్రయోజనాల కోసం దానిని చైనాకు అప్పగించింది. భారత్‌ నుంచి మయన్మార్, అక్కడి నుంచి చైనా అధీనంలోకి వెళ్లిన కోకోఐలాండ్స్‌లో ఇప్పుడు .. డ్రాగన్ కంట్రీ మిసైల్స్‌ను మోహరించింది. అదీ భారత్‌పైకి గురిపెట్టడం ఇప్పుడు ఆందోళనకు కారణమైంది. ఫలితంగా ఇప్పుడు ఇవే కోకో దీవులు..మన దేశభద్రతకు ప్రమాదకరంగా మారాయి.

భారతదేశం మయన్మార్‌తో కోకో దీవుల సమస్యను లేవనెత్తుతూనే ఉంటుంది, విశాఖపట్నం నుంచి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాంబిల్లి వద్ద కొత్తగా నిర్మించిన నౌకాదళ స్థావరం వద్ద భారతదేశం యొక్క అణు జలాంతర్గాముల కదలికను ..చైనా రక్షణదళాలు పర్యవేక్షిస్తుండడం ఆందోళనకు కారణంగా మారింది. భారతదేశం యొక్క బాలిస్టిక్ క్షిపణి ఫైరింగ్ జలాంతర్గాములు దాని తూర్పు బోర్డు ఆధారంగా కొత్త SSBN ప్రస్తుతం విశాఖపట్నం సమీపంలో రీఫిట్ చేయబడుతున్నాయి. బాలాసోర్ మరియు APJ అబ్దుల్ కలాం ద్వీపం వద్ద అణు మరియు సాంప్రదాయిక క్షిపణి పరీక్ష ఫైరింగ్ రేంజ్ వాస్తవంగా... కోకో ద్వీపం వలె అదే అక్షాంశంలో ఉన్నాయి. దీనర్థం చైనీస్ డీప్ స్టేట్ భారతీయ క్షిపణుల పరిధిని పర్యవేక్షించడమే కాకుండా, దాని వైమానిక నిఘా మరియు బాలిస్టిక్ క్షిపణి ట్రాకింగ్ నౌకల ద్వారా తరచుగా హిందూ మహాసముద్రం దాటే పరిస్థితి ఉండడం ప్రమాదకరంగా మారింది.

బంగాళఖాతంలో మయన్మార్‌కు చెందిన కోకో ద్వీపంలో చైనా నిఘా కేంద్రం ఏర్పాటు చేయడంపై భారత్‌ పలుదఫాలుగా ఆందోళన వ్యక్తం చేసింది. భారత్‌ క్షిపణి ప్రయోగ కేంద్రమైన బాలేశ్వర్‌, వ్యూహాత్మక జలాంతర్గాములకు నివాసమైన వైజాగ్‌పై నిఘా పెట్టేందుకు చైనా ఇక్కడ ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొంది. ఈ విషయాన్ని భారత్‌ మయన్మార్‌ పాలకుల దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై మయన్మార్‌ వివరణ సంతృప్తికరంగా లేనట్లు తెలుస్తోంది. భారత్‌ ఆరోపణలను మయన్మార్‌ సైనిక పాలకులు తేలిగ్గా కొట్టిపారేశారు.. ఈ ద్వీపంలో విమానాల రన్‌వే పొడిగింపులో చైనా పాత్ర ఏమాత్రం లేదని పేర్కొన్నారు.

మరోవైపు భారత భద్రతా సంస్థలకు వచ్చిన సమాచారం ప్రకారం అక్కడ రవాణా విమానాల రాకపోకలకు వీలుగా రన్‌వే అభివృద్ధి చేసినట్లు తెలిసింది. దాదాపు 1500 మంది వర్కర్లు ఉండేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ఉపగ్రహ చిత్రాల్లో కోకో దీవుల దక్షిణ కొనపై కొత్తగా ఒక కాజ్‌వే, వసతి సముదాయం తదితరాలను నిర్మిస్తున్నట్టు తేలింది. రన్‌వే, రాడార్‌ స్టేషన్‌కు సమీపంలోనే ఇవన్నీ ఉన్నాయి. భారత యుద్ధనౌకల కదలికలను క్షుణ్ణంగా గమనించడమే ఈ స్థావరం ఉద్దేశం. ఈ పరిణామం భారత్‌కు ఆందోళనకరమే. 2021లో తిరుగుబాటు తర్వాత అంతర్జాతీయంగా ఏకాకి కావడంతో మయన్మార్‌ సైనిక పాలకులు పూర్తిగా చైనాపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో చైనా కూడా 4 బిలియన్‌ డాలర్లు మయన్మార్‌కు సర్దుబాటు చేసింది. దీంతోపాటు బీఆర్‌ఐ ప్రాజెక్టులోకి చేర్చుకొనేందుకు యత్నించింది. ఫలితంగా మయన్మార్ పాలకులు.. చైనాతో సన్నిహితంగా ఉంటూ వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :