ASBL NSL Infratech

మహేష్ బాబు అప్ కమింగ్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ..!?

మహేష్ బాబు అప్ కమింగ్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ..!?

సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా బాలీవుడ్ లో సైతం ఈ హీరో కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రముఖ కంపెనీలు మహేష్ ని బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకోవడానికి క్యూ కడ్తారన్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో సూపర్ స్టార్ మహేష్ బాబు పలు వాణిజ్య ప్రకటనల్లో కూడా కనిపిస్తున్నారు. ప్రస్తుతం తన నెక్స్ట్ ఫిల్మ్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు మహేష్ బాబు. SSMB 28 అంటూ క్రేజీ ప్రాజెక్ట్ తో ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అవుతున్నాడు మహేష్.

ప్రస్తుతం ఈ సినిమా గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న SSMB 28 చిత్రంలో బాలీవుడ్ భామ భూమి పెడ్నేకర్ నటించనున్నట్లు వారలు వస్తున్నాయి. ఈ సినిమాలో భూమి ఒక ప్రత్యేకపాత్రలో కనిపించనున్నట్లు సమాచారం అందుతుంది. SSMB 28 సినిమాలో లేడీ కానిస్టేబుల్ రోల్ కోసం భూమి పెడ్నేకర్ ని మేకర్స్ సంప్రదించినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

శరవేగంగా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకుని, దాదాపు షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా. ఈ చిత్రంలో సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్స్ కోసం ఈ బ్యూటీ ని ఫైనలైజ్ చేసినట్ట్టుగా తెలుస్తుంది. మహేష్ సినిమాలో నటించడానికి ఈ అమ్మడు కూడా రెడీ అవుతుందట. అయితే ఇంకా అఫిషియల్ గా ఈ న్యూస్ పై ఎలాంటి క్లారిటీ లేదు. ఇదే కనుక నిజమైతే  ప్రేక్షకులు టాలీవుడ్ బిగ్ స్క్రీన్ పై ఈ ముద్దుగుమ్మని చూడొచ్చు. ఈ సినిమాలో మహేష్ సరసన శ్రీ లీల, పూజ హెగ్డే నటిస్తున్నారు. అలాగే ఒక ముఖ్యమైన పాత్రలో సీనియర్ హీరో జగపతి బాబు కూడా కనిపించనున్నట్లు తెలుస్తుంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :