బాలయ్య సినిమాలో విలన్‌గా తమిళ హీరో?
అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న బాలకృష్ణ ప్రస్తుతం గోపీ చంద్ మలినేనితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. #NBK107 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. రీసెంట్గా టర్కీ షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసుకుంది ఈ చిత్రం.
ఈ సినిమా తర్వాత బాలయ్య, అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా గురించి అనిల్ రావిపూడి బీభత్సమైన ఎలివేషన్స్ ఇవ్వడంతో ఫ్యాన్స్ అందరికీ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. తండ్రీ కూతుళ్ల నేపథ్యంలో సాగనున్న ఈ కథలో బాలయ్యకు కూతురిగా శ్రీలీల ఇప్పటికే కన్ఫర్మ్ అయింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది.
అదేంటంటే, ఈ సినిమాలో బాలయ్యకు వ్యతిరేకంగా అంటే విలన్ పాత్రలో అరవింద స్వామి నటించనున్నడు అనేదే ఆ న్యూస్. ఇదే కానీ నిజమైతే ఇప్పటికే భారీ హైప్ ఉన్న ఈ ప్రాజెక్ట్ రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం.