ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

త‌మ‌ది ప‌విత్ర బంధ‌మంటున్న హీరోయిన్

త‌మ‌ది ప‌విత్ర బంధ‌మంటున్న హీరోయిన్

సిద్దార్థ్, అదితి రావ్ హైద‌రీ గ‌త కొన్నేళ్లుగా ల‌వ్‌లో ఉన్నార‌ని తెగ వార్త‌లొస్తున్నాయి. ఈ మ‌ధ్య కాలంలో వారిద్ద‌రూ క‌లిసి ఎన్నో ఈవెంట్ల‌లో పాల్గొన్నారు. ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న అన్యోన్య‌త‌కు ఇదే సాక్ష్యం అన్న‌ట్లుగా చాలా ఫోటోలు మ‌రియు వీడియోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. 

గ‌త కొన్నాళ్లుగా వీరిద్దరూ లివ్ ఇన్ రిలేష‌న్‌షిప్ లో ఉన్నార‌నే విషయం తెలిసిందే. హీరోయిన్‌గా అన్ని భాష‌ల్లో అదితికి మంచి గుర్తింపే ఉంది. ఈ టైమ్‌లో అదితి సినిమాలు త‌గ్గించడంపై ఫ్యాన్స్ నిరాశ వ్య‌క్తం చేస్తున్నారు. అయితే అదితి సినిమాల్లో న‌టించ‌క‌పోవ‌డానికి కార‌ణం సిద్దార్థ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

రీసెంట్‌గా అదితి ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ, సిద్దార్థ్‌తో ఉన్న రిలేష‌న్ గురించి ప‌దే ప‌దే మాట్లాడే అవ‌స‌రం లేద‌న్న‌ట్లు చెప్పుకొచ్చింది. ఇత‌రుల విష‌యాల గురించి కొన్నిసార్లు మాట్లాడ‌న‌క్క‌ర్లేదని, ఆ విష‌యాల‌ను ప‌విత్రంగా భావించి వాటిని వ‌దిలేయాల‌ని అదితి వెల్ల‌డించింది. 

అయితే సిద్దార్థ్ తో ఉన్న ప్రేమ విష‌యాన్ని ఎవ‌రూ ఇప్ప‌టి వ‌ర‌కు అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేసింది లేదు. కానీ వారిది ఓ ప‌విత్ర‌మైన బంధంగా అదితి చెప్తుంది. దీంతో నెట్టింట వీరిద్ద‌రి మ‌ధ్య ప్రేమ వ్య‌వ‌హారం న‌డుస్తుంద‌ని మ‌రింత బ‌లంగా ప్ర‌చారం జ‌రుగుతుంది. మ‌రి వీరిద్ద‌రూ త‌మ బంధాన్ని పెళ్లి వ‌ర‌కు తీసుకెళ్తారా లేదా అన్న‌ది చూడాలి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :