ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

తెలంగాణ ప్రభుత్వానికి ఉపరాష్ట్రపతి అభినందనలు

తెలంగాణ ప్రభుత్వానికి ఉపరాష్ట్రపతి అభినందనలు

వికీపీడియా ద్వారా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. నేటి సమాచార సాంకేతిక యుగంలో మన చరిత్ర, గొప్పదనాన్ని యువతరానికి తెలియజెప్పాలన్న కృతనిశ్చయంతో తెలుగు వికీపీడియా వేదిక ద్వారా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్యాన్ని ఆయన కొనియాడారు. తెలుగు భాష అస్తిత్వం, కొనసాగాలంటే మన చరిత్ర, భౌగోళిక, రాజకీయ, ఆధ్యాత్మిక, సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం, కళలు వంటి అంశాలను భవిష్యత్‌ తరాలకు అందేందుకు ఈ సమాచారమంతా తెలుగులో అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు. మంచి కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో తెలుగు వారిగా మనమంతా బాధ్యత తీసుకోవాలని, మనకు లభించే విశ్వసనీయమైన సమచారాన్ని తెలుగు వికీపీడియా ద్వారా అందరికీ అందేలా కృషి చేయాలని ఆయన ట్వీట్‌ చేశారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :