ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

అమెరికాకు కొత్త సవాల్‌!

అమెరికాకు కొత్త సవాల్‌!

అమెరికాలో గత వందేండ్లలో ఎన్నడూ లేనంతగా జనాభా వృద్ధిలో తగ్గుదల నమోదైంది. వృద్దాప్య మరణాలు పెరగడం, జననాలు తగ్గడమే ఇందుకు కారణమని అమెరికా జనాభా గణాంకాలు సృష్టం చేస్తున్నాయి. అంతర్జాతీయంగా వలసలు తగ్గడమూ మరో కారణం. మరో కొన్నేండ్ల పాటు ఇదే తరహా గణాంకాలు నమోదయ్యే అవకాశముందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1917 మొదటి ప్రపంచ యుద్ద కాలం తర్వాత ఇదే అత్యల్ప జనాభా వృద్ధి కావడం గమనార్హం. జననాల సంఖ్య తగ్గడం, మరణాల సంఖ్య పెరగడం, ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక అంతర్జాతీయ వలసలు మందగించడమే జనాభా వృద్ధి తగ్గుదలకు ప్రధాన కారణాలని బ్రూకింగ్స్‌ సంస్థలో సీనియర్‌ సభ్యుడు విలియమ్‌ ఫ్రే చెప్పారు.

2018-19లో కేవలం 0.5శాతం (కోటీ 50 లక్షలు) జనాభా పెరిగి అమెరికా మొత్తం జనాభా 328 మిలియన్లకు చేరుకునట్టు తాజా గణాంకాలు పేర్కొన్నాయి. శతాబ్దంలో తొలిసారి గత శతాబ్ద కాలంలో మొదటిసారి జనాభా వృద్ధి రేటులో తగ్గుదల కనిపించింది. దేశంలో పిల్లల సంఖ్య కంటే వృద్ధులే అధికమయ్యారని, ఈ ధోరణి ఇలాగే కొనసాగినట్టయితే వృద్ధుల సంఖ్య పెరిగి మరణాల సంఖ్య పెరిగే అవకాశముందని ఫ్రే తెలిపారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :