JD Vance: తాజ్‌మహల్‌ను సందర్శించిన జేడీ వాన్స్ ఫ్యామిలీ

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్(JD Vance) ఫ్యామిలీ నిన్న జైపూర్ వెళ్లిన విషయం తెలిసిందే. ఇవాళ ఆగ్రా సందర్శనకు వెళ్లింది. జేడీ వాన్స్, తన భార్య ఉషా వాన్స్ (Usha Vance), ముగ్గురు పిల్లలతో కలిసి యూపీలోని ఆగ్రా (Agra)కు చేరుకున్నారు. ఈ సందర్భంగా వాన్స్ ఫ్యామిలీకి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) స్వాగతం పలికారు. అనంతరం భారీ బందోబస్తు మధ్య జేడీ వాన్స్ తన ఫ్యామిలీతో తాజ్ మహల్ (Taj Mahal) సందర్శనకు వెళ్లారు. అక్కడ తాజ్ అందాలను వీక్షించి, ఫొటోలకు ఫోజులిచ్చారు.