Apple : యాపిల్ సీవోవోగా భారతీయ సంతతి వ్యక్తి సబిహ్ ఖాన్

టెక్ దిగ్గజం యాపిల్ నాయకత్వ బాధ్యతల్లో కీలక మార్పులు చేసింది. భారతీయ మూలాలున్న వ్యక్తికి ముఖ్య బాధ్యతలు అప్పగించింది. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జెఫ్ విలియమ్స్ (Jeff Williams)కంపెనీని వీడనుండటంతో సీఈవో టిమ్ కుక్ (Tim Cook) అదనపు భారం స్వీకరించనున్నారు. విలియమ్స్ సీవోవో బాధ్యతలను యాపిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సబిప్ ఖాన్ (Sabih Khan)కు ఈ నెల చివర్లో అప్పగించనున్నారు. ఈ క్రమంలో డిజైనింగ్ టీమ్ బాధ్యతలను నేరుగా టిమ్‌కుక్ స్వీకరించనున్నారు. సబిప్ ఖాన్ మాలాలు భారత్‌లో ఉన్నాయి. ఆయన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) మొరాదాబాద్ జిల్లాలో 1966వ సంవత్సరంలో జన్మించారు. అక్కడే ఫిఫ్త్ గ్రేడ్ వరకు చదువుకున్నారు. ఆ తర్వాత ఆయన కుటుంబం సింగపూర్‌కు వలస వెళ్లింది. అక్కడే పాఠశాల విద్యాభ్యాసం ముగించి అమెరికా (America) కు వెళ్లారు. 1995లో ఆయన యాపిల్ ప్రొక్యూటర్‌మెంట్ గ్రూప్‌లో పనిచేశారు.