Mahesh Kumar Goud: తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను ఖండించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్

ఎమ్మెల్సీ కవితపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తీవ్రంగా ఖండించారు. మహిళలను గౌరవించడం భారతీయ సంప్రదాయమని, మల్లన్న అనుచిత వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని ఆయన అన్నారు. అదే సమయంలో మల్లన్న కార్యాలయంపై జాగృతి కార్యకర్తల దాడిని కూడా ఆయన ఖండించారు. ఈ దాడి చట్ట వ్యతిరేకమని, అందరూ చట్ట పరిధిలోనే వ్యవహరించాలని మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) సూచించారు. క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి, గన్ మెన్ కాల్పులకు సంబంధించిన ఫిర్యాదులపై చట్ట ప్రకారం విచారణ జరుగుతుందని ఆయన (Mahesh Kumar Goud) తెలిపారు. బీసీ బిల్లు, రిజర్వేషన్లు అన్నీ కాంగ్రెస్ పార్టీ కృషి ఫలితమేనని మహేష్ కుమార్ గౌడ్ పునరుద్ఘాటించారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో ఇతరులు లబ్ధి పొందాలని చూడటం సరికాదని హితవు పలికారు.