టీ-వర్క్స్‌ను ప్రారంభించిన ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్ లియు, మంత్రి కేటీఆర్
హైదరాబాద్‌లో భారతదేశంలోనే అతిపెద్ద ప్రోటోటైపింగ్ సెంటర్ అయిన టి-వర్క్స్‌ను ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్ లియుతో కలిసి మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యువతలోని నైపుణ్యాలను వెలికి తీసేందుకు ఇప్పటికే టీహబ్, వీహబ్ వంటివి ఏర్పాటు చేసుకున్నాం. నేడు కొత్తగా టీ వర్క్స్‌ను ప్రారంభించుకున్నాం. టీ-హబ్ మాదిరిగానే నేడు ప్రారంభమైన టీ-వర్క్స్ సైతం తప్పక విజయవంతం అవుతుందని నమ్ముతున్నా. గ్రామీణ ప్రాంత ఔత్సాహిక యువతకు ఈ టీ-వర్క్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.
ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాదు.. ఐ అంటే ఇండియా, టీ అంటే తైవాన్ అని మంత్రి కేటీఆర్ నిర్వచించారు. సాఫ్ట్‌వేర్‌కు ఇండియా పవర్ హౌస్ లాంటిందని పేర్కొన్నారు. తైవాన్ దేశం హార్డ్ వేర్ రంగంలో సంచలనాలు సృష్టిస్తోంది అని గుర్తు చేశారు. రెండు దేశాలు కలిసి పని చేస్తే ప్రపంచానికి చాలా ఇవ్వొచ్చు అని ఆయన అన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో తాము నియామకాల్లో జరుగుతున్న అన్యాయం గురించి పోరాటం చేశాం. ఇవాళ ఫాక్స్ కాన్ వంటి సంస్థల పెట్టుబడులతో తెలంగాణ యువతకు ఉద్యోగాల లభించడం ద్వారా యువత సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు.






