Telangana Congress: సోషల్ వార్‌కు తెరలేపుతున్న కాంగ్రెస్..!?

తెలంగాణలో (Telangana) కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధికారంలోకి వచ్చి పది నెలలవుతోంది. ఈ కాలంలో రేవంత్ రెడ్డి (Revanth Reddy) సర్కార్ గ్యారెంటీల అమలుకే అత్యధిక ప్రయారిటీ ఇచ్చింది. ఉచిత బస్సు (Free bus), ఉచిత గ్యాస్ సిలిండర్ (Free Gas), రుణమాఫీ (runamafi), రైతు భరోసా (Raithu Bharosa).. లాంటి పథకాలపైనే ఎక్కువగా ఫోకస్ చేసింది. తాజాగా హైడ్రాతో (HYDRA) అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అయినా ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ (BRS) మాటల యుద్ధం చేస్తోంది. దీన్ని ఎదుర్కోవాలనే ఆలోచనలో పడ్డారు రేవంత్ రెడ్డి. అందుకే డిజిటల్ మీడియా (Digital Media) టీంను బలోపేతం చేసే పనిలో పడ్డారు.
తెలంగాణ ఇచ్చింది తామేనని కాంగ్రెస్ (Congress) చెప్తోంది. అయినా పదేళ్లపాటు ఆ పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చినా అంతా సాఫీగా సాగుతున్నట్టు కనిపించట్లేదు. బీఆర్ఎస్ రూపంలో ఆ పార్టీ పెద్ద ప్రతిపక్షాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆ పార్టీని చీల్చి ప్రతిపక్ష హోదా (opposition) లేకుండా చేయాలని కాంగ్రెస్ ప్రయత్నించినా అది వర్కవుట్ కావట్లేదు. పీఏసీ ఛైర్మన్ (PAC Chairman) ను కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నేతకు కట్టబెట్టడం, రైతు భరోసా నిదులు విడుదల కాకపోవడం, రైతు రుణమాఫీ అందరికీ కావట్లేదనే ఆరోపణలు రావడం.. లాంటివి ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారాయి.
హైడ్రా పనితీరుపై రేవంత్ సర్కార్ కు మంచి పేరు వస్తోంది. అక్రమార్కులు ఎంతటివారైనా ఉపేక్షించకుండా ముందుకు సాగుతుండడంపై ప్రశంసలు వస్తున్నాయి. అయితే ఇటీవల వరదలను (Floods) ఎదుర్కోవడంలో రేవంత్ సర్కార్ విఫలమైందనే విమర్శలు కూడా ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం తాము అద్భుతంగా చేశామని చెప్పుకుంటున్నారు. ఇటీవల ఓ సర్వే ప్రకారం రేవంత్ రెడ్డి సర్కార్ పై పల్లెల్లో (Rural) వ్యతిరేకత వ్యక్తమవుతుండగా పట్టణ ప్రాంతాల్లో (Urban) మాత్రం మంచి పేరు వస్తోందని తేలింది. ఎక్కడో తేడా కొడుతోందని భావించిన రేవంత్ రెడ్డి దిద్దుబాటు చర్యలు చేపట్టారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు రాష్ట్రంలో విధ్వంసం సృష్టించిందని.. దాన్ని తాము చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. తాము ఎంతో చేస్తున్నా అవి ప్రజల్లోకి వెళ్లట్లేదని.. బీఆర్ఎస్ చేస్తున్న దుష్ప్రచారమే ఎక్కువగా ఫోకస్ అవుతోందని గుర్తించారు. అందుకే బీఆర్ఎస్ విమర్శలను గట్టిగా తిప్పికొట్టేందుకు బలమైన డిజిటల్ మీడియా టీం రెడీ చేసుకున్నారు. ప్రభుత్వపరంగా డిజిటల్ కార్పొరేషన్ (Digital Corporation) లాంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. అదే సమయంలో పార్టీపరంగా కూడా సోషల్ మీడియా వింగ్ (Social Media Wing)ను మరింత బలోపేతం చేశారు. గత ఐదేళ్లపాటు ఏపీలో జగన్ (YS Jagan)కు అనుకూలంగా డిజిటల్ కార్పొరేషన్ నడిపించిన టీం ఇప్పుడు రేవంత్ కోసం పనిచేస్తున్నట్టు సమాచారం.