రాష్ట్ర ప్రభుత్వం తేలికగా తీసుకున్నా.. కేంద్రం మాత్రం

తెలంగాణలో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కోరారు. ఈ మేరకు ఆ పార్టీ నేతలు రాజ్‌భవన్‌లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్‌పై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తేలికగా తీసుకున్నా కేంద్రం మాత్రం వదిలిపెట్టదని హెచ్చరించారు. సీబీఐ విచారణ ద్వారే నిజాలు బయటకు వస్తాయన్నారు.