Revanth Reddy: దర్శనానికి లెటర్లు అడుక్కోవడం ఏంటీ…?రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!

తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)… ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. నా మీద వ్యతిరేకత వచ్చింది అంటున్నారు… ఎందుకు ఉంటారు కోపంగా అని నిలదీశారు. ఆడ బిడ్డలకు బస్సు ఫ్రీ ఇచ్చిన అందుకు కోపంగా ఉంటారా అని ప్రశ్నించారు. 21 వేల కోట్లు రుణాలు మాఫీ చేసినందుకు కోపమా… ఉద్యోగాలు ఇచ్చినందుకు నాపై కోపం ఉందా అంటూ మండిపడ్డారు. సోషల్ మీడియా లో ఎవడో ఏదో పెడితే మీరు సైలెంట్ గా ఉండకండి అని పార్టీ నేతలకు సూచించారు.
సోషల్ మీడియా అంటేనే పెట్టుబడిదారులదన్నారు. పట్టు రాలేదు రేవంత్ కి అంటున్నారని… ఈటెల లాంటి వాళ్ళను పార్టీలో నుండి బయటకు పంపినందుకు పట్టు వచ్చినట్టా అంటూ ఎద్దేవా చేసారు. రాజయ్య నీ కారణం చెప్పకుండా తీసేస్తే పట్టు వచ్చినట్ట అని ప్రశ్నించారు. సచివాలయంకే రాని ఆయనకు పరిపాలన మీద పట్టు ఉందట అంటూ సెటైర్ లు వేసారు. 18 గంటల పని చేసే నాకు పట్టు లేదట… మేము ధర్నా చేయానియక పోతే పట్టు ఉన్నట్టా..? అని మండిపడ్డారు.
పోలీసులకు నేను ఆదేశాలు ఇస్తే.. కేటీఆర్(KTR) నీ దంచరా..? అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. నువ్వు ఆదేశాలు ఇచ్చినవు… నేను అలాంటి విధానం కి నేను వ్యతిరేకం అని స్పష్టం చేసారు. కోదండరాం తలుపులు బద్దలు కొట్టారు మీరు అని విమర్శించారు. మేము అలా చేయమన్నారు. మీరు ధర్నాలు చేసి తిడుతున్నారని… మేము అనుమతి ఇవ్వకపోతే చేస్తారా అని ప్రశ్నించారు. మనుషుల రూపంలో ఉన్న క్రూర మృగాలు కనుక్కోలేనా.. నల్లమలలో పెరిగిన వాణ్ణి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
సీఎం అనే వాడు.. విజ్ఞతతో ఉండాలి అందుకే విజ్ఞత తో ఉంటున్నాను అన్నారు. ఆయనకు విజ్ఞత లేదు కాబట్టి ఫార్మ్ హౌస్ నుండి బయటకు రావడం లేదని మండిపడ్డారు. ప్రతిసారి వాళ్ళని మా ఎంఎల్ఏ లెటర్ తో దర్శనం అడుక్కోవడం ఎందుకు అని ప్రశ్నించారు. భద్రాచలం లో రాముడు లేడా అని ప్రశ్నించారు. మనకు శివుడి ఆలయాలు తక్కువా అంటూ నిలదీశారు.