ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్ సందడి

ఉప్పల్ క్రీడా మైదానంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందడి చేశారు. హైదరాబాద్-చైన్నై మధ్య ఐపీఎల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేశారు. కుటుంబంతో కలిసి ఆయన మ్యాచ్‌ను తిలకించారు. రేవంత్ రెడ్డిని చూసిన క్రికెట్ అభిమానులు సీఎం సీఎం అంటూ కేరింతలు కొట్టారు. అలాగే ప్రముఖ సినీ నటులు చిరంజీవి, వెంకటేశ్, బ్రహ్మానందం, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, పట్నం సునీతా రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు మ్యాచ్‌ను ఆస్వాదించారు.