Ramachandra Rao:వారి కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం: రామచందర్‌రావు

కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు, బాధితులకు రూ.లక్ష చొప్పున పరిహారం ఇవ్వాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు (Ramachandra Rao) ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు. కల్తీ కల్లు ఘటనలో అనధికారికంగా ఆరుగురు మృతి చెందారు. ఒకటి రెండు సీసాల కల్లు తాగిన వారి కిడ్నీలు (Kidneys) దెబ్బతిన్నాయి. కల్తీ కల్లులో సైకో ట్రాఫిక్ సబ్ స్టన్స్ కలిపినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఎక్సైజ్ శాఖ (Excise Department) కల్లు కాంపౌండ్ వారితో కుమ్మక్కైంది. ఈ ఘటన మొదటిసారి కాదు, గతంలోనూ వెలుగు చూశాయి. ఎక్సైజ్ అధికారులు రోజూ కల్లు కాంపౌండ్ (Kallu Compound)లలో తనిఖీలు చేయాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని అన్నారు.