Ponnam Prabhakar: తెలంగాణలో చూసిన తర్వాతే.. కేంద్రం కళ్లు తెరిచింది : మంత్రి పొన్నం

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు బిల్లును కేంద్రం ఎందుకు ఆమోదించడంలేదని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించాల్సిన బాధ్యత రాష్ట్ర బీజేపీ (BJP) నేతలపై ఉందన్నారు. రాష్ట్రపతితో ఆమోదింపజేసి, 9వ షెడ్యూల్‌లో చేర్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రివర్గం (State Cabinet) లేదా అఖిలపక్షం ఢల్లీికి వచ్చేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. భారత రాష్ట్ర సమితి, బీజేపీలో ఉన్న బీసీ నేతలు వాళ్ల అధిష్ఠానంపై ఒత్తిడి పెంచాలి. బీసీల రిజర్వేషన్లకు అడ్డుపడే పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలి. రిజర్వేషన్లపై బీజేపీ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారు. తెలంగాణ (Telangana)లో కులగణన చూసిన తర్వాతే కేంద్రం కళ్లు తెరిచింది. రాష్ట్ర ఒత్తిడితోనే కేంద్రం జనగణనతో పాటు కులగణనను ప్రకటించింది అని తెలిపారు.