New ration card: కొత్త రేషన్ కార్డుల జారీకి ముహూర్తం ఖరారు

తెలంగాణలో కొత్త రేషన్‌కార్డుల జారీకి ముహుర్తం ఱరారైంది. ఈ నెల 14న తుంగతుర్తి (Tungaturthi) లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేతుల మీదుగా రేషన్‌కార్డు (Ration card)ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2.4 లక్షల కొత్త రేషన్‌కార్డులను పంపిణీ చేయనున్నారు. దీని ద్వారా 11.30 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. రాష్ట్రంలో గత ఆరు నెలల్లో 41 లక్షల మందికి ప్రభుత్వం కొత్తగా రేషన్ పంపిణీ చేసింది. త్వరలో పంపిణి చేయనున్న వాటితో కలిపి రేషన్‌కార్డుల సంఖ్య 94,72,422కి చేరనుంది. మొత్తంగా 314 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది.