Chamala Kirankumar: మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ…అప్పుల రాష్ట్రంగా : చామల

మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా ఎందుకు మార్చారో భారత రాష్ట్ర సమితి నేతలు చెప్పాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (chamala kirankumar reddy )డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ చర్చకు రాకుండా సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy)ని ఎందుకు దూషిస్తున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీ (Assembly) లో అర్థవంతమైన చర్చ జరగాలని ప్రజలు (People) ఆశిస్తున్నారని తెలిపారు. నీటిపారుదల శాఖ గురించి తాము మాట్లాడుతుంటే అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.