మలేసియా పర్యటనకు మంత్రి శ్రీధర్‌బాబు

తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, శాట్జ్ చైర్మన్ శివసేనా రెడ్డిలు మలేసియా పర్యటనకు వెళ్లారు. ఈ నెల 9న మలేసియాలోని మాట్రేడ్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరిగే తెలంగాణ అసోసియేషన్ దశాబ్ది ఉత్సవాల్లో వారు పాల్గొంటారు. వారితో పాటు పలువరు రాజకీయ నాయకులు, వైస్ ఛాన్సులర్లు తదితరులు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొంటారని సమాచారం. వీరంతా తిరిగి 12వ తేదీ తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకుంటారు.