Seethakka: సీతక్క వర్సెస్ ఒవైసీ, సీతక్కపై ఒవైసీ ప్రసంశ

అసెంబ్లీ వేదికగా అక్బరుద్దీన్ ఓవైసీకి మంత్రి సీతక్క(Seethakka) కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ (BRS) సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజలకు ఇళ్ళు ఇవ్వలేదని మండిపడ్డారు. మౌలిక సదుపాయాలు కల్పించలేదని.. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు ఇండ్లు రోడ్లు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. వ్యవస్థ అంతా కుప్పకూలినట్లుగా మాట్లాడటం సరికాదు…అధికారుల ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా మాట్లాడవద్దని సూచించారు. అప్పుడు అనుమతులు లేకుండా అడ్డగోలుగా నిర్మాణాలు జరిగాయన్నారు.
అక్రమ నిర్మాణాలకు మా ప్రభుత్వం అడ్డుకట్టలు వేస్తోందన్నారు. దీన్ని నిర్మాణాలు ఆలస్యం అవుతున్నాయని ప్రచారం చేయడం సరికాదని ఆమె వ్యాఖ్యానించారు. గతంలో పోలీసు అధికారులకు జీతాలు చెల్లించేందుకు వారికి కెమెరాలు ఇచ్చి పైసలు వసూలు చేశారన్నారు. కానీ మా ప్రభుత్వం పోలీసులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల మొదటి రోజే జీతాలు ఇస్తోందని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ ల కోసం పోలీసు వ్యవస్థను వాడుకున్నారని దాని గురించి అక్బరుద్దీన్ ఓవైసీ బాగుంటే మాట్లాడితే బాగుంటుందన్నారు.
అలాకాకుండా మమ్మల్ని నిందించడం తగదని కౌంటర్ ఇచ్చారు. మహిళల వేధింపులకు సంబంధించి డ్రగ్స్, మత్తు పదార్థాలు కారణమని వాటి మీద ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. పదేళ్ల కోపాన్ని మా మీద తీయడం కరెక్ట్ కాదని మండిపడ్డారు. టిఆర్ఎస్ పదేళ్ల కాలంలో మహిళల మీద లక్ష్య కు పైగా దాడులు జరిగాయన్నారు. మహిళలపై జరిగే దాడులను అరికట్టడానికి ఏం చేయాలో అక్బరుద్దీన్ ఓవైసీ గారు సూచిస్తే మంచిదని తెలిపారు. అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. సీతక్క ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారని ఆమె పడ్డ కష్టాలన్నీ నాకు తెలుసు అని కొనియాడారు. మారుమూల పల్లెల నుంచి వచ్చి మంత్రి అయ్యారు.. అభినందిస్తున్నాను అన్నారు.