అధైర్యపడొద్దు .. డిసెంబర్ ఆఖరిలోపు : మంత్రి పొంగులేటి

రైతులు అధైర్యపడొద్దని, పంటలకు మద్దతు ధర ఇస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ ఆఖరిలోపు పెండింగ్‌లో ఉన్న రూ.13 వేల కోట్ల రుణమాఫీ చేస్తామన్నారు. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామన్నారు. రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామన్నారు. డిసెంబర్‌లో గ్రూప్-1 అభ్యర్థులకు నియామకపత్రాలు ఇచ్చేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.