Teenmar Mallanna: ఆమెపై చర్యలు తీసుకోవాలి.. నాకు రక్షణ కల్పించాలి

శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukhender Reddy) ని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) కలిశారు. ఆదివారం క్యూ న్యూస్ కార్యాలయం (Q News Office ) పై జరిగిన దాడి ఘటనపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై హత్యాయత్నం జరిగిందని, దానిపై మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేశామన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అనుచరుల విధ్వంసంపై వివరించినట్లు తెలిపారు. డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కవితపై ఎథిక్స్ కమిటీ (Ethics Committee )కి ఫిర్యాదు చేశాం. ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరాం. నాకు రక్షణ కల్పించాలని మండలి చైర్మన్‌ను కోరాను. ఘటనపై విచారణ చేస్తామని మండలి చైర్మన్ హామీ ఇచ్చారు. బీసీల కట్టుబాట్లు, పదజాలం ఏమిటో కవితకు తెలియదు. బీసీల రాజకీయాన్ని నిలువరించాలనే ఉద్దేశంతోనే చర్యలకు పాల్పడుతున్నారు అని అన్నారు.